రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.20 నాణెలను విడుదల చేయకముందే.. ప్రభుత్వ మింట్ ఉద్యోగి దొంగిలించాడు.
దీంతో ఆ ఉద్యోగిపై ముంబైలోని ఎమ్మార్ఏ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాణెలు దొంగిలించిన ఉద్యోగిని ఆర్ఆర్ చబుకశ్వర్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో దోషిగా తేలితే ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడనుంది.
సెంట్రల్ ఇండస్ర్టీయల్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్.. చబుకశ్వర్ లాకర్‌లో విడుదల కాని రూ. 20 నాణెలను రెండింటిని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు.
దీంతో అధికారులు అప్రమత్తమై విచారణకు ఆదేశించారు.
ఈ క్రమంలో చబుకశ్వర్ లాకర్ తెరిచి చూడగా అందులో రెండు నాణెలు లభ్యమయ్యాయి.
దీంతో ఆ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కొత్త రూ. 20 నాణెలు ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ నాణెలను విడుదల చేయలేదు.
అయితే చబుకశ్వర్ ను పోలీసులు అరెస్టు చేయలేదు. కరోనా పూర్తిగా నిర్మూలన అయిన తర్వాత అతన్ని విచారణకు ఆదేశిస్తామని, అప్పటి వరకు సహకరించాలని ఆయనకు పోలీసులు చెప్పారు.