సారా అలీఖాన్… బాలీవుడ్ తారలు అమృతాసింగ్, సైఫ్ అలీఖాన్‌ల గారాల కుట్టి. అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందిన సారా… ఆ తరువాత తల్లితండ్రుల బాటలోనే నడిచింది. తెరంగేట్రం కోసం బాగా బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ జిమ్‌లో కసిగా కష్టపడింది. కట్ చేస్తే కొన్నాళ్లకు ‘ఈమె సారానేనా’ అని ఆశ్చర్యపోయేంత నాజూగ్గా తయారైంది. 2018లో ‘కేదార్‌నాథ్’తో నాయికగా బాలీవుడ్ ఫ్యామిలీలో కలిసిపోయిన సారా… ఇప్పుడు కుర్రాళ్ల హృదయనేత్రి అయింది. అదే ఏడాది ‘సింబా’లోనూ మెరిసింది. ఈ రెండూ కమర్షియల్ హిట్ కొట్టడంతో ఆమె క్రేజ్ పెరిగింది. లాక్‌డౌన్‌లో షూటింగ్‌లన్నీ బంద్ ఉన్నా… సారా మాత్రం విభిన్న డ్రెస్సుల్లో మెరుస్తూ అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటోంది. అన్నట్టు సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో తెలుసా..? రెండున్నర కోట్లకు పైనే! సారా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఎల్లో మిర్చీ ఉన్న టాప్, పసుపు పచ్చని బ్లాక్‌డాటెడ్ ఫ్రాక్‌లో మెరిసిపోతున్న ఈ ‘పిక్చర్ పర్‌ఫెక్ట్’కు లైకులెన్ననుకొంటున్నారు? ఇప్పటికి 17 లక్షలు! అదీ ఈ బ్యూటీ స్టామినా!
ఎల్లో ఎల్లో…ప్రెట్టీ ఫెల్లో
Related tags :