సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏపీ సీఐడీ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
ఆగస్టు 1 నుంచి 31వరకూ ఆన్‌లైన్ లైవ్ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమంలో నిపుణులు పాల్గొంటారు.
నేరాల తీరుతెన్నులు, వాటి బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారని, బాలికల తల్లిదండ్రులు, విద్యార్థులు, మహిళలు, యువత.. ఇలా అన్నివర్గాలవారు ఈ లైవ్‌లో పాల్గొనవచ్చని ఏపీ సీఐడీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆగస్టు 1న పోస్టర్ ఆవిష్కరణ 2న రేడియో ద్వారా సందేశం, 3న రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వెబినార్ ద్వారా ఈ-రక్షాబంధన్.. అవగాహన కార్యక్రమ ప్రారంభం ఉంటుందని పేర్కొంది.