* రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 9,276 కరోనా కేసులురాష్ట్రంలో 1,50,209కు చేరిన కరోనా పాజిటివ్ కేసులురాష్ట్రంలో కరోనాతో 24 గంటల వ్యవధిలో 59 మంది మృతిరాష్ట్రంలో 1407కి చేరిన కరోనా మరణాలురాష్ట్రంలో మొత్తం 72,188 కరోనా యాక్టివ్ కేసులురాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 76,614 మంది బాధితులురాష్ట్రంలో కొత్తగా 60,797 మందికి కరోనా పరీక్షలుఇప్పటివరకు 20.12 లక్షల నమూనాలు పరీక్ష చేసిన ప్రభుత్వం.
* జిల్లా అంతటా 24 గంటల పాటు నిషేధాజ్ఞలు అమలు.- అత్యవసర సేవలకు మినహాయింపు.- ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు .అనంతపురము : కరోనా వైరస్ కట్టడి చర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 24 గంటల పాటు నిషేధాజ్ఞలు అమలు చేస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ, రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం (02.08.2020) ఉదయం 6:00 గంటలు మొదలుకొని సోమవారం ( 03.08.2020) ఉదయం 6.00 గంటల వరకు అత్యవసర సేవలు మినహా ప్రజలు బయట సంచరించకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సి ఆర్ పి సి సెక్షన్ 144 కింద , జిల్లా కలెక్టర్ కు సంక్రమించిన అధికారాల మేరకు జిల్లాలో ఐదు మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడ కుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు.
* తెలంగాణ హెల్త్ బులిటెన్ విడుదల.గడిచిన 24 గంటల్లో 2083 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు.కొత్తగా 11 మరణాలు, 530కి చేరిన మొత్తం మరణాల సంఖ్య.GHMC- 578, రంగారెడ్డి 228, వరంగల్ అర్బన్ 134, మేడ్చెల్-197, కరీంనగర్-108, సంగారెడ్డి-101 కేసులు నమోదు.
* ఏపీ రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో కన్నుమూశారు. ఇటీవలే ఆయన తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడదే ఆయన చివరి ట్వీట్ అయింది. తనపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తానని అభిమానులు, కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కానీ విధిరాత మరోలా ఉండడంతో ఆయన తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు!
* ఏపీకి వచ్చే వారు స్పందన వెబ్ సైట్ లో తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి… డీ ఎస్పీ రమణ మూర్తికృష్ణాజగ్గయ్యపేటఏపి సరిహద్దు చెక్ పోస్ట్ వద్దబారులు తీరిన వాహనదారులుసరిహద్దు వద్దఈ పాస్ లేని వారిని అనుమతించని అధికారులువారిని తిప్పి పంపుతున్న వైనంకేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 నిబంధనల ప్రకారం సరిహద్దు చెక్ పోస్ట్ వద్దసడలింపులుస్పందన ఆప్ ద్వారా నమోదు చేసుకున్న వారికి మాత్రమే అనుమతిఆటోమాటిక్ గా ఈ పాస్ మొబైల్, ఈ మెయిల్ కి వస్తుందిదానిని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చుఈ నమోదు వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమేఆ తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వారి ఆరోగ్యంపై దృష్టి ఉంచుతారురేపటి నుంచి ఈ విధానం అమలు లోనికి వస్తుందనిడీ ఎస్పీ రమణ మూర్తి తెలిపారు
* కరోనా కట్టడికి సంబంధించిన మరో శుభవార్త వినిపిస్తోంది. ముంబైకి చెందిన స్టార్టప్ సంస్థ రూపొందించిన ఫేస్ మాస్క్… నోరు, ముక్కు ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా చూడటమే కాకుండా, వైరస్‌ను కూడా అంతం చేస్తుంది. ముంబైకి చెందిన స్టార్టప్ సంస్థ నానోటెక్నాలజీని ఉపయోగించి కరోనా వైరస్ కిల్లర్ మాస్క్‌ను అభివృద్ధి చేసింది. ఈ మాస్క్‌కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీనిని వాష్ చేసుకుంటూ 60 నుంచి 150 సార్లు వరకూ ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. ముంబైకి చెందిన స్టార్టప్ థర్మ్‌సెన్స్ తయారుచేసిన ఈ మాస్క్ కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడమే కాకుండా, మాస్క్ బయటి పొరకు వైరస్ అంటుకునేలా చేసి, దానిని చంపేస్తుంది.