Movies

సోనూసూదు…నీ మనస్సుకు లేదు సరిహద్దు

సోనూసూదు…నీ మనస్సుకు లేదు సరిహద్దు

బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తల్లిదండ్రుల మరణంతో అనాథలైన ముగ్గురు చిన్నారులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌(ఎం) మండల కేంద్రానికి చెందిన గట్టు సత్తయ్య 18 నెలల క్రితం మరణించారు. అతని భార్య అనురాధ కూడా అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు మనోహర్‌ (10), లాస్య (7), యశ్వంత్‌ (4) అనాథలయ్యారు. ఈ విషయాన్ని కరణం రాజేష్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో సోనూ సూద్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశారు. దీనికి స్పందించిన సోనూ సూద్‌ ‘ఆ ముగ్గురు చిన్నారులు అనాథలు కాదు, వారి బాధ్యత నాది’ అంటూ ట్వీట్‌ చేశారు.