పాకిస్థాన్ క్రికెట్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది టీమ్ఇండియాపై కామెంట్ చేస్తూ మరోసారి సెల్ఫ్‌గోల్ వేసుకున్నాడు. ఇటీవల ట్విటర్లో తన అభిమానులతో ముచ్చటించిన అతడిని ఒకతను ఆసక్తికర ప్రశ్న వేశాడు. ‘భాయ్ మీ మీద ఉన్న గౌరవంతో అడుగుతున్నా.. ప్రపంచకప్‌లలో టీమ్ఇండియాపై ఎందుకంత ఘోరంగా విఫలమయ్యారు?అన్ని మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 56 పరుగులు చేసి, ఒకటే వికెట్ తీశారు. అందుకు కారణం ఏంటని అనుకుంటున్నారు?’ అని సూటిగా అడిగేశాడు. దానికి స్పందించిన మాజీ క్రికెటర్. ఏం చెప్పాలో అర్థం కాక.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ఇలా అన్నాడు. ‘టీమ్ఇండియా లక్కీ’ అనుకుంటానని నవ్వుతున్న ఏమోజీతో రీట్వీట్ చేశాడు.
ఇండియా లక్కీ
Related tags :