కరోనా మొదలైనప్పటి నుంచీ రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం, పండ్ల రసాలు, స్మూతీల వాడకం బాగా పెరిగింది. కొందరు ఆయుర్వేద కషాయాలు కూడా ప్రయత్నిస్తున్నారు. తాజాగా వీటి జాబితాలో రోజూ తాగే పాలు వచ్చి చేరాయి. అవును ఇప్పటి వరకూ ఫుల్‌క్రీమ్, స్టాండర్ట్ రూపంలో లభించిన పాలు ఇప్పుడు ‘తులసి మిల్క్’, ‘అశ్వగంధ మిల్క్’, పెప్పర్ మిల్క్’, ‘జింజర్ మిల్క్’, ‘క్లోవ్ మిల్క్’ అనే అయిదు సరికొత్త రూపాల్లో దొరకుతున్నాయి. ఈ పాలు తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ప్రజలు ‘కొవిడ్-19’ బారిన పడకుండా చూసేందుకు కర్ణాటకలోని మిల్క్ ఫెడరేషన్(కేఎమ్‌ఎఫ్) వాళ్లు ఈ మధ్యే ఈ కొత్తరకం పాల అమ్మకాలను ప్రారంభించారు. ఒక్కో బాటిల్ ధర 25 రూపాయలు.ఔషధ గుణాలున్న ఈ పాలు తాగితే దేహపుష్టితో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ‘‘ఈ పాల ఉత్పత్తుల తయారీలో ఉపయోగించిన ఔషధ మొక్కలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కరోనాకు ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాక్సీన్, ఔషధం అందుబాటులో లేదు. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వేడి నీళ్లు తాగుతున్నారు. ఆయుర్వేద మాత్రలు వాడుతున్నారు. మా వినియోగదారులు కరోనా బారిన పడకుండా చూసేందుకు మా వంతు ప్రయత్నంగా ఈ అయిదు రకాల పాల ఉత్పత్తులను తీసుకువచ్చాం’’ అంటారు కేఎమ్‌ఎఫ్ ఛైర్మన్ బాలచంద్ర జర్కీహోలి. ఈ రోగనిరోధక శక్తి పాలకు ఇప్పుడిప్పుడే కర్ణాటకలో మంచి డిమాండ్ ఏర్పడుతోంది.
కర్ణాటక స్పెషల్ కోవిద్-19 పాలు
Related tags :