‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత మరో సినిమా కోసం కలుస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్, హీరో ఎన్టీఆర్. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అని ఫిబ్రవరిలో ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో సరిగ్గా తెలియదు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రచారంలో ఉంది.దులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నారన్నది ఆ వార్త సారాంశం. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో కియారా ఒకరు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉందని తెలిసింది. అలానే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. హారికా హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.
తారక్‌తో కియారా

Related tags :