Fashion

కమలా తొక్కలని మొహం మీద పిండుకుంటే….

కమలా తొక్కలని మొహం మీద పిండుకుంటే….

విటమిన్‌ సి అధికంగా ఉండే కమలాపండు సౌందర్య పోషణలోనూ చక్కగా ఉపయోగపడుతుంది…

చర్మరంధ్రాలు తెరుచుకుని ఉండటం వల్ల ముఖంపై దుమ్మూధూళి పేరుకుని యాక్నె లాంటి సమస్యలు తలెత్తతాయి. చర్మం బిగుతుగా ఉంటే ఈ సమస్యరాదు. అందుకే కమలాపండు రసంలో చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించి రెండు మూడు నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే ముఖం నిగారింపుతో కనిపిస్తుంది. సమస్య దూరమవుతుంది.

* యాక్నె సమస్య ఉన్నవారు కమలాపండు రసానికి సమాన పరిమాణంలో కీరదోస రసం కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ రసంలోని ప్రత్యేక ఆమ్లాలు ముఖంపై ఉన్న మృతకణాలను తొలగించి సరికొత్త మెరుపును తీసుకొస్తాయి. యాక్నె తాలూకు మచ్చలనూ తొలగిస్తాయి.

* కమలాపండు తొక్కలను ఎండ బెట్టి పొడి చేసుకుని ఉంచుకుంటే ప్యాక్‌లు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండు చెంచాల పాలు లేదా పెరుగు తీసుకుని తగినంత పొడితో కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇరవైనిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది బ్లీచింగ్‌లా పనిచేస్తుంది. అంతేకాదు చర్మంలో తేమను పెంచి సాగే గుణాన్నీ అందిస్తుంది.