‘ఆర్.ఎక్స్.100’, ‘ఆర్డీఎక్స్ లవ్’ చిత్రాల్లో తన అందచందాలు ఆరబోసి అభిమానుల హృదయాలు కొల్లగొట్టింది కథా నాయిక పాయల్ రాజ్‌పూత్. మీరు బోల్డ్ పాత్రల గురించి ఇంట్లో చర్చిస్తారా అని అడగ్గా ఆసక్తికరంగా సమాధానం చెప్పుకొచ్చింది. ‘నేను కథ విన్న తరువాత అందులోని విషయాలన్నీ మా అమ్మతో పంచుకుంటా. ఇన్ని ముద్దు సీన్లు ఉన్నాయి, ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని వివరిస్తా. నీ మనసుకు నచ్చి, నీకు సౌకర్యంగా అనిపిస్తే ఏదైనా చెయ్యి అని అమ్మ సలహా ఇస్తుంటుంది. బోల్డ్ పాత్రలు ఎంత ఇష్టపడి చేసినా అమ్మానాన్నలతో కలిసి చూడటం అసౌకర్యంగానే ఉంటుంది. వాళ్లకి నన్నలా చూడటం ఇబ్బందిగానే అనిపించొచ్చు కానీ, ఎప్పుడూ బయటకు చెప్పరు’ అని చెబుతోంది పాయల్.
పేరెంట్స్ ఆ సినిమా చూసి…
Related tags :