Kids

అ నుండి ఱ వరకు సూక్తులు

అ నుండి ఱ వరకు సూక్తులు

అ:- అన్వేషించడం మొదలుపెట్టు…
ఆ:- ఆత్మవిశ్వాసానికి పదునుపెట్టు…
ఇ:- ఇష్టపడటం నేర్చుకో…
ఈ:- ఈర్ష్యపడటం మానుకో…
ఉ:- ఉన్నతంగా ఆలోచించు…
ఊ:- ఊహకు అందేలా ఆచరించు…
ఋ:- ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు…
ఎ:- ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు…
ఏ:- ఏకాగ్రతను అసలు కోల్పోకు…
ఐ:- ఐక్యమత్యాన్ని సాధించడం మర్చిపోకు…
ఒ:- ఒంటరి జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది…
ఓ:- ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒక రోజు గెలుపుకు బాటలు వేస్తాయి…
ఔ:- ఔన్నత్యానికి గెలుపోటములు నీ పునాదులు అని మరువకు…
అం:- అందని ఎత్తుకు ఎదగాలంటే…
అః:- అఃర్నిశలుగా ఇప్పటి నుండి శ్రమించాలని తెలుసుకో….
క:- కష్టపడి పనిచేయడం నేర్చుకో…
ఖ:- ఖచ్చితత్వం అలవరుచుకో….
గ:- గమ్యాన్ని ఎంచుకొని పయనించు…
ఘా:- ఘాటుగా స్పందించడం నేర్చుకో…
జ్ఞ:- జ్ఞాపకాలను గుర్తుంచుకొని మసలుకో…
చ:- చతురతను ప్రతి విషయంలో నేర్పుగా వ్యవహరించు…
ఛ:- ఛత్రపతిలా జీవితాన్ని సార్ధకం చేసుకో….
జ:- జగడాలకు దూరంగా ఉండు..
ఝ:- ఝుమ్మంది నాదంగా మారు…
ణ:- జనగణమన గీతాన్ని మర్చిపోకు..
త:- తర తమ బేధాలను అణగదొక్కు.
థ:- థదేకంగా ధ్యానించు….
ద:- దయాదాక్షిణ్యాలు కలిగివుండు…
ధ:- ధర్మమును ఎల్లప్పుడూ ఆచరించు…
న:- నట జీవితం నేర్చుకోకు…
ప:- పరిహాసమాడకు…
ఫ:- ఫలితాలను సమంగా చూడు…
బ:- బలముతో అన్ని పనులు నెరవేరవు…
భ:- భయాన్ని దరిచేర నీయకు…
మ:- మర్యాదగా వ్యవహారించు…
య:- యవ్వనాన్ని అపహాస్యం చేయకు…
ర:- రంగురంగుల జీవితంలో పడి మోసపోకు…
ల:- లక్షణమైన జీవితాన్ని ఏర్పరుచుకో…
వ:- వంచనకు గురికాకు, గురిచేయకు…
శ:- శిరస్సును వంచుకునే పనిచేయకు…
ష:- షడ్రుచులను ఆస్వాదించు…
స:- సన్నిహితులను ఏర్పరుచుకో…
హ:- హానికరమైన పనులు ఏనాడు చేయకు…
ళ:- అవహేళన చేయకు…
క్ష:- క్షణికావేశానికి లోనుకాకు…
ఱ:- ఱణాన ఎదురు నిలువు…