DailyDose

నిందితుడికి విజయవాడ కోర్టు ఉరిశిక్ష-నేరవార్తలు

crime-news-vijayawada-court-orders-kidnapper-be-hanged

* చిన్నారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.కృష్ణా జిల్లా చిన్నారి హత్య కేసులో జిల్లా కోర్ట్ సంచలన తీర్పు.ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష.2019 నవంబర్ 10న విజయవాడలో ద్వారక అనే బాలిక అపహరణ.ద్వారకను అపహరించి హత్య చేసిన నిందితుడు పెంటయ్య.పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన విజయవాడ పోలీసులు.పెంటయ్య నేరంకి పాల్పడినట్లు ఛార్జిషీట్. నేరం రుజువు కావడంతో పెంటయ్యకు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు. గతంలో తోటి విద్యార్థినిని అతికిరాతకంగా హత్య చేసిన మనోహర్ అంశంలోనూ ఉరిశిక్ష విధించిన కోర్ట్.

* మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి సీడ్ యాక్సిస్ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. జాతీయ జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఇవాళ హైకోర్టులో విచారణ ఉన్నందున.. న్యాయమూర్తులు వెళ్లే సమయంలో నమస్కారం పెట్టి నిరసన తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.

* నకరికల్లు మండలం శివాపురంలో దారుణంరమావత్ మంత్రూభాయి (55) అనే మహిళను ట్రాక్టర్ తో తొక్కించి వైసీపీ నేత శ్రీనివాసరెడ్డిఅక్కడికక్కడే మృతి చెందిన మహిళమూడు సంవత్సరాల క్రితం బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద 3.80 లక్షలు అప్పు తీసుకున్న భార్యాభర్తలుపొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న మంత్రూభాయి దంపతులుఅప్పు తీర్చనందుకు పొంలంలో ఉన్న సమయంలో ట్రాక్టర్ తో తొక్కించిన శ్రీనివాసరెడ్డినర్శింగపాడు వైసీపీ నేత బోనముక్కల శ్రీనివాసరెడ్డి.మృతదేహం తో రోడ్ పై బైఠాయించి నిరసన చేస్తున్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు మరియు ప్రజా సంఘాల నాయకులు.చనిపోయిన మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వైసిపి నాయకులు దౌర్జన్యాలను ఖండించారు.

* దిచక్ర వాహనం ట్రాలీ ఆటో ఎదురు ఎదురుగా వేగంగా ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలం మాచర్ల ప్రధాన రహదారి ఆత్మకూరు మిర్చియార్డు వద్ద మంగళవారం ఉదయం జరిగింది.సంఘటనకు సంబంధించిన వివరాలు ప్రకారం బొల్లాపల్లి మండలం గండి గనుమల గ్రామానికి చెందిన రామావత్తు రాములు నాయక్ ముడావత్తు సోమ్లా నాయక్లు తమ హాండా బ్తెక్ ప్తె మాచర్ల వ్తెపు వెళ్ళు చుండగా మాచర్ల వ్తెపు నుండి ఫోర్ వీల్ ట్రాలీ ఆటో శ్యామరాజుపురం బుగ్గ వాగు వద్ద చేపలు తీసుకోచ్చెందుకు వస్తుండగా ఆత్మకూరు మిర్చియార్డు వద్ద ఎదురు ఎదురుగా వేగంగా ఢీకోన్నాయి.

* విశాఖలో మరో పేలుడు… తప్పిన పెను ప్రమాదంవిశాఖలోని అచ్యుతాపురం సెజ్​లో విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది.పేలుడు దాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో కార్మికులు పరుగులు తీశారు.సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవముందే విశాఖలో వరుసగా ఫార్మా కంపెనీలలో అగ్ని ప్రమాదాలు జరగడం అక్కడి ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది.మొన్నటికి మొన్న సైనార్ ఫార్మా పరిశ్రమలో బెంజిన్ లీకవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.తాజాగా విశాఖలోని అచ్యుతాపురం సెజ్​లో విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది.పేలుడు దాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అందులో పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు.పేలుడు దాటికి రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధం కాగా..సమీపంలోనే అగ్ని మాపక యంత్రం ఉండటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

* చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన ఓ 13ఏళ్ళ బాలుడు సెల్ ఫోన్ చోరీచేశాడని అభియోగంతో గతనెల 30వతేదీన ఏడుగురు హత్య చేసిన సంఘటన పాఠకులకు విధితమే.మంగళవారం మదనపల్లె రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్ కుమార్ హత్యా నిందితులను అరెస్టు చేశారు.వివరాలు.. మదనపల్లె మండలం రామాపురం గ్రామంకు చెందిన చాంద్ బాష ఇంటిలో చంద్రశేఖర్ కు భార్య, కుమారుడు భరత్, ఇద్దరు కుమార్తెలు అద్దెకు ఉంటున్నారు.జులై 30న ఇంటిఓనర్ చాంద్ బాష తన సెల్లును భరత్ అనే బాలుడు చోరీ చేశాడని పెదనాన్న శివయ్య, కుమారుడు అశోక్ కుమార్లు సెల్ ఫోన్ విషయమై మందలించగా చోరీ చేసినట్లు బాలుడు ఒప్పుకున్నాడు.అయితే ఆ సెల్ ఫోన్ ఇంటి ఓనర్ చాంద్ బాషకు అమ్మినట్లు బాలుడు తండ్రి చెప్పాడు.అశోక్, రాజేష్, రవిలు బాలుడిని వెంటబెట్టుకుని ఇంటిఓనర్ చాంద్ బాషను అడిగారు.ఆగ్రహించిన చాంద్ బాష, ఇంటి అద్దెకు ఉంటున్న మోహన్ లు బాలుడిని చితకబాదారు.అంతటితో ఆడకుండా ఆ బాలుడిని రాత్రి వేరొకచోటకు తీసుకెళ్ళి సెల్ ఫోన్ విషయమై నిలదీస్తూ తీవ్రంగా చితకబాదారు. సెల్ ఆచూకి తాను చెప్పిస్తానని గ్రామవాలంటీర్ వెంకటప్రవీణ్ అపస్మారక స్థితిలో పడివున్న బాలుడికి అగ్గిపుల్ల గీసి బెదిరిస్తు కొట్టారు.