DailyDose

కరణం బలరాంకు కరోనా-TNI బులెటిన్

కరణం బలరాంకు కరోనా-TNI బులెటిన్

* 9747 new case today in AP

* ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది.దీంతో హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో కరణం బలరాం చికిత్స పొందుతున్నారు.ఇప్పటికే ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతను కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. 

* తిరువూరు 19 వ వార్డు రవి విద్యానికేతన్ బజార్లో కొత్తగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు ఇదే వ్యక్తి భార్యకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది నేడు వావిలాల లో మరో రెండు కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి

* కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ నేత సిద్ధ రామయ్యకు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

* భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా తొలి దశ ట్రయల్స్‌ పూర్తయిందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. భారత్‌ బయోటెక్‌తో పాటు జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ కూడా తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్నట్టు ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ తెలిపారు. రెండో దశ ట్రయల్స్‌కు ఇరు సంస్థల వ్యాక్సిన్లు సిద్ధమైనట్టు చెప్పారు. రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయని తెలిపారు. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా-పుణెతో కలిసి తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ రెండు, మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. వారం రోజుల్లో 17 ప్రదేశాల్లో ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయన్నారు. భౌతికదూరం పాటించడమే ఇప్పటివరకు కరోనాకు ఉత్తమ వ్యాక్సిన్‌ అని చెప్పారు.

* అనారోగ్య లక్షణాలు కనబడితే ఆస్పత్రికి వెళ్లకుండా ఎవరూ దాచుకోవద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలను కోరారు. ఇప్పటికే ఎన్నో రకాల వైరస్‌లను ఎదుర్కొన్న అనుభవం మన వైద్యులకు ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల్ని మళ్లీ మళ్లీ కోరుతున్నాం. జ్వరమే కదా.. దగ్గే కదా.. జలుబే కదా.. ఏమైతదిని మీ ఇళ్లలోనే మీరు ఉండొద్దు. అలా ఉంటే నాలుగైదు రోజులకో, వారం రోజులకో తీవ్రమైన శ్వాసకోశ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఈ రోగం ముఖ్య లక్షణమే ఊపిరితిత్తుల్లో గాలాడనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసి చంపుతుంది. అందువల్ల వెంటనే చికిత్స అందితే ప్రాణ నష్టం ఉండదు. చికిత్స కూడా చాలా సులభం. పీహెచ్‌సీ స్థాయిలో కూడా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి’’ అని చెప్పారు.