గాయని స్మిత కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకోగా కరోనా నిర్ధారణ అయిందన్నారు. ‘‘నిన్న నిజంగా దుర్దినం. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో బహుశా ఎక్కువగా వ్యాయామం చేయడం వల్లనేమో అనుకున్నా. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకున్నా. శశాంక్, నేనూ కరోనా పాజిటివ్‌గా తేలింది. లక్షణాలు అంతగా లేవు. కరోనాను తన్ని తగలేడమే మిగిలింది. ఆ తర్వాత ప్లాస్మా దానం చేస్తాం. మేం ఇంట్లోనే ఎంతో జాగ్రత్తగా ఉన్నాం. అయినా కరోనా మా ఇంటికి వచ్చింది’’ అని ట్వీట్ చేశారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే నిర్మాత పోకూరి రామారావు, దర్శకుడు రాజమౌళి, నటుడు పృథ్వీలు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలోకి స్మిత వచ్చి చేరారు. రామారావు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
నొప్పులని పరీక్ష చేస్తే కరోనా పాజిటివ్
Related tags :