Politics

ఏపీని అడ్డుకోమని కేసీఆర్‌కు ఉత్తమ్ సలహా

ఏపీని అడ్డుకోమని కేసీఆర్‌కు ఉత్తమ్ సలహా

పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులు చేపట్టకుండా న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏపీ ప్రాజెక్టులను నిలువరించాలని కోరారు. లేకపోతే ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాపై కూడా ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు అమలు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.