* ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. సాధారణ ప్రజలకూ అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి. బులియన్ చరిత్రలో తొలిసారి అటు ఫ్యూచర్స్,.. ఇటు స్పాట్ మార్కెట్లలో బంగారం ధరలు మంగళవారం 2,000 డాలర్లకు ఎగువన ముగిశాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) దాదాపు 35 డాలర్లు జంప్‌చేసి 2021 డాలర్ల వద్ద ముగసింది. ఇక స్పాట్ మార్కెట్లోనూ పసిడి 2019 డాలర్ల వద్ద నిలిచింది. తద్వారా సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇక వెండి సైతం ఔన్స్ 26 డాలర్లను దాటేసింది. వెరసి 2013 తదుపరి గరిష్ట స్థాయికి వెండి చేరింది!దేశీయంగానూప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.6 శాతం బలపడి 2032 డాలర్లకు ఎగువన కదులుతోంది. స్పాట్ మార్కెట్లో మాత్రం 0.2 శాతం నీరసించి 2014 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి సైతం 0.3 శాతం నీరసించి 26 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. కాగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల పసిడి రూ. 834 లాభపడి రూ. 54,551 వద్ద నిలిచింది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధరకాగా.. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర రూ. 4049 దూసుకెళ్లి రూ. 69,797 వద్ద ముగిసింది. వెరసి నేటి ట్రేడింగ్‌లోనూ పసిడి ధరలు హైజంప్ చేయనున్నట్లు కమోడిటీ నిపుణులు చెబుతున్నారు.ర్యాలీ బాటలోనేప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి(అక్టోబర్ ఫ్యూచర్స్) రూ. 219 పుంజుకుని రూ. 54,770 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర సైతం రూ. 64 బలపడి రూ. 69,861 వద్ద కదులుతోంది.2500 డాలర్లకుసమీప భవిష్యత్‌లో ఔన్స్ పసిడి 2500 డాలర్లను తాకే వీలున్నట్లు యూఎస్‌కు చెందిన బులియన్ సాంకేతిక విశ్లేషకులు విడ్మర్, ఫ్రాన్సిస్కో బ్లాంచ్ అభిప్రాయపడ్డారు. బంగారానికి అత్యంత కీలకమైన 2000 డాలర్ల రెసిస్టెన్స్‌ను భారీ ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించడంతో ఇకపై మరింత జోరందుకునే వీలున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. రానున్న 18 నెలల కాలంలో బంగారం ఔన్స్ ధర 3,000 డాలర్లకు చేరవచ్చని బీవోఎఫ్‌ఏ గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. కోవిడ్-19 ప్రపంచ దేశాలన్నిటా వేగంగా విస్తరిస్తుండటం, కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం వంటి అంశాలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.
* ఆధార్ కార్డు మన నిత్య జీవితంలో భాగమైపోయింది. ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ఎప్పుడైనా ఆధార్ కార్డు మరిచిపోతే దానికోసం యాతన పడాలి. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా డిజిటల్ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. చాలా మంది డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో తెలీక ఇబ్బంది పడుతుంటారు. కింది చిత్రాల్లో చూపినట్లు చేస్తే సులువుగా డిజిటల్ ఆధార్‌ను పొందొచ్చు. పోస్టల్‌లో వచ్చినట్లుగానే దీనికి కూడా గుర్తింపు ఉంటుందని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది.
* వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బుధవారం ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్ 343 పాయింట్ల లాభంతో 38,031 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 11198 వద్ద ఉంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 75.05 వద్ద కొనసాగుతోంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం గోద్రేజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ ఏకీకృత ప్రాతిపదికన రూ.394.88 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.407.60 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 3.1 శాతం తక్కువ. కొవిడ్-19 మహమ్మారి వల్ల మార్కెట్‌లో తలెత్తిన అవాంతరాలు ప్రభావం చూపాయని కంపెనీ తెలిపింది. నికర విక్రయాలు రూ.2330.59 కోట్ల నుంచి రూ.2311.17 కోట్లకు తగ్గాయి. మొత్తం వ్యయాలు రూ.1995.56 కోట్ల నుంచి 2.16 శాతం తగ్గి రూ.1952.31 కోట్లకు చేరాయి. కంపెనీ ఇండియా ఆదాయం 4.96 శాతం వృద్ధితో రూ.1380.65 కోట్లకు చేరింది.
బీఎస్‌ఈలో షేరు 2.12 శాతం నష్టంతో రూ.683.50 వద్ద ముగిసింది.