సాధారణంగా భారతీయులకు వెజ్ కర్రీస్‌లో ఇష్టమైన కర్రీ ఏంటంటే సాంబార్ అని తడబడకుండా చెప్పేస్తారు. మరి అలాంటి సాంబార్‌కు అంత టేస్ట్ రావాడానికి కారణం అందులో వేసే మునక్కాడ, క్యారెట్, ముల్లంగి వల్లనే. క్యారెట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మరి ముల్లంగి వల్లన గాని దాని గింజల వల్ల కలిగే లాభాల గురించి తెలిసిన వారు చాలా తక్కువగా ఉంటారు.
* ముల్లంగి గింజల్ని నానబెట్టి గుజ్జులా చేసుకోవాలి. చర్మసమస్యలతో బాధపడేవారికి ఈ పేస్ట్ ఎంతో ఉపశమనాన్నిస్తుంది. ఈ మిశ్రమాన్ని చర్మసమస్యలు ఉన్న ప్రదేశాల్లో రాసుకోవాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
* అధిక బరువు ఉన్నవారు ముల్లంగితో తయారు చేసిన కూరను తింటే ఎంతో మేలు. అంతేకాదు, ముల్లంగి కూర మధుమేహం ఉన్న వారికి కూడా మేలు చేస్తుంది.
* ముల్లంగి గింజలను పొడిచేసి పెట్టుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా తాగడం వల్ల క్రిములు, పురుగులు వంటివి చనిపోతాయి.
* మహిళలకు ముఖంపై మొటిమలు, మచ్చలు వేదిస్తూ ఉంటే ముల్లంగి గింజల్ని నూరి పేస్ట్‌లా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖం మృదువుగా, ఎంతో అందంగా తయారవుతుంది.
* ముల్లంగిలో పొటాషియం, ఐరన్ వంటి విటమిన్లు ముల్లంగిలో పుష్కలంగా ఉన్నాయి.
* మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు ముల్లంగి ఆకులను నీటిలో ఉడకబెట్టి అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
* జీర్ణ సమస్యలతో బాధపడే చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఎవరైనా ముల్లంగి హాయినిస్తుంది. భోజనం చేసిన తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి.
* ముల్లంగిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటి మీద నిమ్మరసం, మిరియాల పొడిని చల్లాలి. వీటి మీద కొంచెం సాల్ట్ కూడా చల్లుకుంటే టేస్టీగా ఉంటుంది. రోజుకు మూడుసార్లు తింటే మొలలు, కామెర్లు, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.