Movies

అయ్యగారు వద్దన్నాడని…

అయ్యగారు వద్దన్నాడని…

న‌యన‌తార‌, విఘ్నేశ్ శివ‌న్ వెడ్డింగ్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్న న‌య‌న్‌-విఘ్నేశ్ 2019 డిసెంబ‌ర్ లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఈ ఏడాది స‌మ్మర్ లో వివాహం జ‌రుగ‌నుందని టాక్ రాగా.. క‌రోనా ఎఫెక్ట్ తో సాధ్యం కాలేదు. అయితే ఏడాది మాత్రం త‌ప్ప‌కుండా ఈ క్రేజీ క‌పుల్ ఒక్క‌ట‌వడం ఖాయ‌మ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా వీరిద్ద‌రి పెళ్లి వార్త మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి వ‌చ్చింది. న‌య‌న్‌-విఘ్నేష్ ఓ జ్యోతిష్యుడిని సంప్ర‌దించ‌గా..కొన్ని ఆల‌యాల‌ను సంద‌ర్శించాల‌ని సూచించాడ‌ట‌. జ్యోతిష్యుడి సూచ‌న‌ల మేర‌కు గ‌త ఏడాది కాలంలో ఈ ఇద్ద‌రూ చాలా ఆల‌యాల‌కే వెళ్లివచ్చార‌ట‌. ఈ జంట కుంభ‌కోనంలోని లార్డ్ రాహు టెంపుల్ ను సంద‌ర్శించ‌డంతో..ఆల‌యాల ప‌ర్య‌ట‌న పూర్త‌వుతుంది. లార్డ్ రాహు టెంపుల్ వెళ్లొచ్చిన త‌ర్వాత న‌య‌న్‌-విఘ్నేశ్ అధికారికంగా తమ పెళ్లి తేదీల‌ను ప్ర‌క‌టించ‌నున్నార‌ని కోలీవుడ్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. న‌యన‌తార‌ ప్ర‌స్తుతం ఆర్‌జే బాలాజీ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న మూకుథి అమ్మ‌న్ చిత్రంలో న‌టిస్తోంది. ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ తో క‌లిసి న‌టిస్తోన్న మూవీ 2021 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.