WorldWonders

ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశం

ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశం

ఏ దేశం వద్ద బంగారం ఎక్కువగా ఉందో తెలుసా? చాలా మంది మన దేశం వద్దనే అధిక బంగారం ఉంటుదని భావిస్తూ ఉంటారు. కానీ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక గమనిస్తే షాక్ అవుతారు.బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువ. పసిడిపై మనకే కాదు ఎవరికైనా మక్కువ ఎక్కువగానే ఉంటుంది. అందుకే ప్రపంచంలోని ప్రతి దేశంలో బంగారాన్ని నిల్వ చేసుకోవాలని భావిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. బంగారం సురక్షితమైన ఇన్వెస్ట్‌‌మెంట్ సాధనం కావడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వరల్డ్ గోల్ద్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం.. ప్రపంచంలో బంగారం ఏ దేశం వద్ద ఎక్కువగా ఉందో తెలుసుకుందాం. దీని ప్రకారం అమెరికా వద్ద బంగారం ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికా వద్ద ఏకంగా 8133 టన్నుల బంగారం ఉంది. అమెరికా తర్వాతి స్థానంలో జర్మనీ కొనసాగుతోంది. జర్మనీలో 3364 టన్నుల బంగారం ఉంది.అమెరికా, జర్మనీ తర్వాతి స్థానంలో ఇటలీ కొనసాగుతోంది. ఈ దేశం వద్ద 2451 టన్నుల బంగారం ఉంది. ఇటలీ తర్వాతి స్థానం ఫ్రాన్స్‌ది. ఫ్రాన్స్‌ నాలుగో స్థానంలో ఉంది. ఈ దేశం వద్ద 2436 టన్నుల బంగారం ఉంది. ఐదో స్థానంలో రష్యా కొనసాగుతోంది. దీని వద్ద 2299 టన్నుల బంగారం ఉంది.ఇప్పుడు జాబితాలోకి చైనా వచ్చింది. చైనా ఆరో స్థానంలో ఉంది. ఈ దేశం వద్ద 1948 టన్నుల బంగారం ఉంది. చైనా తర్వతి స్థానం స్విట్జర్లాండ్‌ది. స్విట్జర్లాండ్‌ వద్ద 1040 టన్నుల బంగారం ఉంది. దీంతో ఈ దేశం ఏడో స్థానంలో నిలిచింది. ఇక ఎనిమిదో స్థానంలో జపాన్ కొనసాగుతోంది. ఈ దేశం వద్ద 765 టన్నుల బంగారం ఉంది. ఇక 9వ స్థానంలో ఇండియా కొనసాగుతోంది. మన దేశం వద్ద 653 టన్నుల బంగారం ఉంది. 612 టన్నులతో పదో స్థానంలో నెదర్లాండ్స్ కొనసాగుతోంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వల ప్రాతిపదికన ఈ నివేదిక తయారైంది.