దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కరోనా విళయతాండవం చేస్తుంది. అయితే కరోనా కేసులు నమోదైన కొత్తలో అనేక దేశాలు లాక్ డౌన్ ను అమలు చేసాయి. ఆ తరవాత దేశాల ఆర్ధిక స్థితిని దృష్టిలో ఉంచుకుని కరోనా తో కలిసి జీవించాలి అనే నినాదంతో లాక్ డౌన్ ను ఎత్తివేసాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా పెరిగింది. కాగా లాక్ డౌన్ తరవాత బార్ లు క్లబ్బులు తెరవటంతో యువత తమకు కరొనతో ఎలాంటి ముప్పు ఉండదన్న ఉద్దేశంతో యథేచ్ఛగా తిరుగుతున్నారు. పార్టీలు చేసుకుంటూ అసలు వైరస్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయారు. కాగా ఈ విషయమై యువత తమను తాము ప్రశ్నించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ… కరోనా విషయంలో యువత బాధ్యత తీసుకోవాల్సిన అవసరముందన్నారు. కచ్చితంగా పార్టీకి వెళ్లాలా..? అని తమను తాము ప్రశ్నంచుకోవాలని అన్నారు. చాలా మంది యువత తమ కాంటాక్ట్‌ల వివరాలను వెల్లడించడం లేదని ఆయన ఆవేదన చెందారు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అని వైరస్‌ని ఎలాగైనా ఆపాలని అన్నారు.
యువత కాస్త ఇంగితం అలవర్చుకోవాలి:-WHO
Related tags :