* రేపటి నుండి జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరణ… కోవిద్ సెంటర్లో పని చేస్తున్న 400 మంది జూడాలు…. వేతనం పెంచాలని డిమాండ్…. కోవిద్ సెంటర్ లో పని చేసే వారికి వసతి కల్పించాలి…. భీమా సౌకర్యం కల్పించి, ప్రేత్యేక పిపిఈ కిట్లు అందించాలి…. పిపిఈ కిట్లు సరిగ్గా లేక కోవిద్ బారిన పడుతున్న డాక్టర్లు …. ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుండి విధులు బహిష్కరణ చేస్తామని హెచ్చరిక…. ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ వేతనం ఇస్తున్నారంటూ ఆవేదన.
* కరోనాపై పోరులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల బెడ్స్ వద్ద కాలింగ్ బెల్స్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు తరచుగా రోగుల వద్దకు వెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.రోగికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాలింగ్ బెల్ నొక్కితే.. డాక్టర్ లేదా నర్సు వచ్చి అతడి పరిస్థితి పర్యవేక్షించాల్సి ఉంటుంది.రాష్ట్రంలో ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య శాఖ సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
* ప్రకాశం జిల్లాలో కలకలం.. పత్తా లేని 150 మంది కరోనా పేషెంట్లుతప్పుడు చిరునామాలతో కరోనా పరీక్షలుఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్న పేషెంట్లుపోలీసులను ఆశ్రయించిన వైద్యాధికారులుఅసలే ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.అయినా పరిస్థితి కంట్రోల్ లోకి రావడం లేదు.ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా అధికారులకు ముచ్చెమటలను పట్టిస్తున్నాయి.కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన దాదాపు 150 మందికి పైగా పేషెంట్లు పత్తా లేకుండా పోయారు.ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ లలో బాధితులు లేకపోవడం, వారి సెల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ లో ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
* కావలిలో సంపూర్ణ లాక్ డౌన్. ఇప్పటి వరకు నియోజక వర్గంలో 439 కరోనా కేసులు నమోదుకరోనా కేసులు నివారించే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఆర్.డి.ఓ, మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ అధికారులు కలసి సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయంఉదయం గం”5 నుండి గం”8 వరకు కూరగాయల దుకాణాలకు మాత్రమే అనుమతి.రేపు 8వ తేదీ నుండి 16వ తేదీ ఆదివారం వరకు అన్ని దుకాణాల మూత.
* భారత్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజులు గుడుస్తున్నకొద్దీ మునుపెన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలో వైరస్ కేసుల సంఖ్య గురువారం నాటికి 20 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారీ స్థాయిలో 62,538 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,27,075కు చేరింది. కాగా రోజువారీ కేసుల విషయంలో ప్రస్తుతం అమెరికాను కూడా ఇండియా దాటేసింది.ఇప్పటి వరకు 41,585 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం 6,07,384 యాక్టివ్ కేసులు ఉండగా.. 13,78,106 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అయితే భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. వైరస్ కోరల్లోంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ శాతం 67.6కు పెరిగింది.