Movies

ఏకధాటిగా 23గంటల పాటు

ఏకధాటిగా 23గంటల పాటు

ఇప్పుడు బాలీవుడ్‌లో జోరుగా షికారు చేస్తున్న వార్తల్లో అనన్యా పాండేకి సంబంధించినది ఒకటి. గత ఏడాది ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమాతో హిందీ తెరకు పరిచయమైంది అనన్య. ప్రముఖ నటుడు చంకీ పాండే కూతురామె. క్యూట్‌గా ఉంటుంది. చక్కగా నటిస్తుంది. కష్టపడే మనస్తత్వం ఉన్న అమ్మాయి. ప్రొఫెషన్‌ అంటే బోలెడంత ప్రేమ. అందుకే నిద్ర లేకుండా షూటింగ్‌ చేయమన్నా చేస్తుంది. ఈ మధ్య అలానే చేసింది. ప్రస్తుతం ‘ఖాలీ పీలీ’ అనే సినిమాలో నటిస్తోందీ బ్యూటీ. ఈ సినిమా కోసం నాన్‌స్టాప్‌గా 23 గంటలు షూటింగ్‌ చేసింది అనన్య. అందుకే ఆ సినిమా యూనిట్‌ అంతా ‘అనన్య.. అసామాన్య’ అంటున్నారు. పని విషయంలో ఇంత శ్రద్ధగా ఉంటున్న అనన్య కచ్చితంగా మంచి స్థాయికి ఎదుగుతుందని కూడా అభినందిస్తున్నారు.