Movies

క్రికెటర్‌తో పెళ్లి

క్రికెటర్‌తో పెళ్లి

‘అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమెకు అరుంధతి నక్షత్రం చూపే వరుడు దొరికేశాడు. త్వరలోనే పెళ్లి కబురు చెబుతారు’ అంటూ ఎప్పటికప్పుడు వార్తలు హల్‌చల్‌ చేస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి అనుష్క పెళ్లి వార్తలకు సంబంధించిన చర్చ మొదలయింది. ‘ప్రస్తుతం అనుష్క ఓ క్రికెటర్‌తో డేటింగ్‌ చేస్తున్నారని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు’ అనే వార్త సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. అనుష్క పెళ్లి చేసుకోబోయే క్రికెటర్‌ నార్త్‌ ఇండియాకు చెందినవారని, ప్రస్తుతం సౌత్‌లో రంజీ మ్యాచ్‌ లు ఆడుతున్నారని ఆ వార్తల సారాంశం. మరి ఈ వార్తను అనుష్క నిజం చేస్తారా? వేచి చూడాలి.