DailyDose

మూడు నెలల్లో ఏపీ కొత్త జిల్లాలపై స్పష్టత-తాజావార్తలు

మూడు నెలల్లో ఏపీ కొత్త జిల్లాలపై స్పష్టత-తాజావార్తలు

* ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందడుగు.25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు.కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు.ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు.చీఫ్ సెక్రటరీ చైర్ పర్సన్ గా కమిటీ ఏర్పాటు.కమిటలో సభ్యులుగా ఆరు శాఖల అధికారులు.కమిటీ కన్వీనర్ గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ.మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దిష్ట గడువు.అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు.

* భాజపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీఎం రమేష్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచనమేరకు హైదరాబాద్‌లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని తెలిపారు.

* పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్‌ వైఫల్యం చెందారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. జూమ్‌ యాప్‌ ద్వారా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడు అంశంలో కేసీఆర్‌ మౌనం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి హాజరుకాకుండా కేబినెట్‌ భేటీ ఎందుకని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో సీమ ఎత్తిపోతలను ఆపే ఒక్క అంశం లేదని చెప్పారు. పిటిషన్‌లో కర్ణాటక, మహారాష్ట్రను ఎందుకు చేర్చారో చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాకపోతే కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా పలుదేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలసిందే. తాజాగా అమెరికా తన పౌరులకు సూచించే ప్రయాణ మార్గదర్శకాలను సవరించింది. ఇప్పటివరకు కొనసాగుతోన్న ఆరోగ్య సూచన అత్యధిక స్థాయి(లెవల్‌-4)ని అమెరికా ఎత్తివేసింది. అయితే భారత్‌, చైనాతోపాటు మరో 50దేశాలకు నాలుగో స్థాయి సూచనను కొనసాగించింది. దీంతో భారత్‌, చైనా దేశాలకు ప్రయాణం చేయొద్దని అమెరికా అక్కడి పౌరులకు సూచించింది.

* తెలంగాణ రాష్ట్రంలో బీరు విక్రయాలు పడిపోయాయి. లిక్కర్‌ను‌ మాత్రం అదేస్థాయిలో తాగుతున్నారు. బీరు అమ్మకాలు తగ్గినా ఆదాయం అధికంగా సమకూరుతోంది. గత ఏడాది జులై కంటే ఈసారి రూ.600కోట్లు అదనంగా ఖజనాకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాల్లో మద్యానికి డిమాండ్‌ చాలా పెరిగింది. మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని మద్యం దుకాణాలకు అదనపు ఆదాయం వస్తోంది.

* ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. భాజపా అధ్యక్షుడిగా నియమితులైనందుకు సోము వీర్రాజుకు పవన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా శాలువా కప్పి సోము వీర్రాజును సత్కరించారు. ఏపీలో రెండు పార్టీలు కలిసి పనిచేయడంపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఏపీలో భాజపా, జనసేన కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.

* అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి అనేది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని, దాన్ని కాపాడుకోవడం రాష్ట్ర ప్రజల కర్తవ్యమని తెలిపారు. ఏపీ రాజధాని విషయంపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. అన్నీ అనుకూలంగా ఉన్నాయనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను అమరావతికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. తమ హయాంలో జిల్లాలకు 160 ప్రాజెక్టులు ప్రకటించామని చంద్రబాబు తెలిపారు.

* ఏపీ రాజధాని అమరావతి కోసం ఎంత ఖర్చుచేశారో పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించండం మంచి పరిణామమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొందరు నేతలు హైకోర్టుపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని, సంయమనం పాటించాలని సీఎం కోరితే బాగుంటుందన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు చాలా మంది చిన్న చిన్న ఫ్లాట్స్‌ కొనుక్కున్నారు.అమరావతి కన్నీటి వెతలు ఇంకెన్నాళ్లు? రాజధాని లేకుండా రైతుల కష్టాలు ఎలా తీరుస్తారు?’’ అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

* కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు. కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేసిన వారిని సీపీ సజ్జనార్‌ సత్కరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా బారిన పడి ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. కరోనాకు మందు లేని పరిస్థితుల్లో అయోమయం నెలకొంది. ప్లాస్మా అనేది బాధితుల పాలిట సంజీవనిగా నిలుస్తోందన్నారు.

* తమ భవిష్యత్‌పై టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌ నోరు విప్పాల్సిందని దిల్లీ క్యాపిటల్స్‌ లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా అభిప్రాయపడ్డాడు. మూడు, నాలుగేళ్ల క్రితమే భారత జట్టుకు దూరమైన ఈ సీనియర్‌ లెగ్‌ స్పిన్నర్‌ ఇంకా జాతీయ జట్టుకు ఆడతాననే నమ్మకంతో ఉన్నాడు. తాజాగా క్రికెట్‌.కామ్‌‌తో అతడు మాట్లాడుతూ దిగ్గజ క్రికెటర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వయసును బట్టి ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయొద్దని, జట్టు యాజమాన్యానికి ఏం కావాలో స్పష్టంగా వారితో చర్చించాలన్నాడు. ఒకవేళ వాళ్లు ఫిట్‌నెస్‌గా లేకపోతే నేరుగా ఆ విషయం చెప్పాలని, అలా మాట్లాడితే ఆటగాళ్లెవరూ బాధపడరని పేర్కొన్నాడు.