సూపర్ కార్ల తయారీ కంపెనీ గోర్డన్ ముర్రా ఆటోమోటీవ్ సరికొత్త సూపర్ కారును పరిచయం చేసింది. పూర్తిగా డ్రైవింగ్‌ను అస్వాదించే వారి కోసం తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇది ముర్రా 50 డిజైన్ కావడంతో కారుకు ‘టి.50’ అని పేరు పెట్టారు. చూడటానికి రేసుకారులా ఉన్నా.. నిత్యజీవితంలో కూడా వాడుకునేలా తీర్చిదిద్దారు. ఈ కారు బరువు టన్నులోపు ఉండటం విశేషం. మొత్తం 986 కిలోలు. సాధారణంగా ఒక సూపర్ కార్ బరువులో ఇది మూడోవంతు మాత్రమే. ఈ కారులో అత్యంత శక్తిమంతమైన 4.0లీటర్ వీ12 కాస్‌వర్త్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది కేవలం 178 కిలోల బరువే ఉంది. ఇది 11,500 ఆర్‌పీఎం వద్ద 654 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఇక 9,000 ఆర్‌పీఎం వద్ద 467 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్ టూ వెయిట్ నిష్పత్తి ప్రతి టన్నుకు 662 బీహెచ్‌పీ అని చెప్పింది. 6స్పీడ్ మాన్యూవల్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు. వాహనం వెనుక భాగంలో అమర్చిన అతిపెద్ద ఫ్యాన్ దీనికి సూపర్ కార్ లుక్‌ను ఇస్తుంది. వేగంలో కారు స్థిరత్వం కోల్పోకుండా గాలిని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. కారు ఇంటీరియర్ కూడా మెక్లారెన్ ఎఫ్1ను తలపిస్తుంటుంది. యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను అనుసంధానించేలా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ కారులో 288 లీటర్ల లగేజ్ స్పేస్ ఇచ్చారు. ఇటువంటివి కేవలం 100 కార్లు మాత్రమే తయారు చేస్తామని కంపెనీ తెలిపింది. కారు ధర 2.3 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.23 కోట్లు. తాయరుకానున్న 100 కార్లు ఇప్పటికే అమ్ముడైపోయాయని పేర్కొంది. ఇక కేవలం రేస్ ట్రాక్ మీద ప్రయాణించే మరో 25 కార్లు చేస్తామని వెల్లడించింది.
₹23కోట్ల సూపర్ కారు
Related tags :