Movies

మజా మజా మెహరీన్

మజా మజా మెహరీన్

షూటింగ్, ప్రయాణాలు, ప్రమోషన్లతో యాక్టర్స్‌ డైరీ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఆ రొటీన్‌ నుంచి చిన్న బ్రేక్‌ కోసం అప్పుడప్పుడు సరదా ట్రిప్స్‌ ప్లాన్‌ చేస్తుంటారు. ఆ చిన్న విరామంలో విహారం, వినోదం ఉండేలా చూసుకుంటుంటారు. ప్రస్తుతం అలాంటి చిన్న ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు మెహరీన్‌. జనవరిలో మెహరీన్‌ నటించిన మూడు సినిమాలు (ఎంత మంచి వాడవురా!, పటాస్‌ (తమిళం) అశ్వథ్థామ) విడుదలయ్యాయి. ప్రస్తుతం శ్రీలంకలో హాలిడేయింగ్‌ చేస్తున్నారామె. శ్రీలంకలోని వాటర్‌ పార్కులు, జూ పార్కులు చుట్టేస్తున్నారు మెహరీన్‌. ఆ ఫొటోలు తన సోషల్‌మీడియాలో పంచుకున్నారు. మరోవైపు ‘కంచె’ హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలీలో వెకేషన్‌ చేస్తున్నారు. అక్కడ జలపాతాల వద్ద దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.