ScienceAndTech

కుక్కర్‌లో N95 మాస్క్‌ను ఉడికించండి

కుక్కర్‌లో N95 మాస్క్‌ను ఉడికించండి

కరోనాను అడ్డుకునేందుకు ఇప్పుడు అందరూ మాస్కులను వాడుతున్నారు.

ఎన్‌95 మాస్కులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.

అయితే, ఇవి చెడిపోకుండా, కరోనా వైరస్‌ను నిర్మూలించేలా శుభ్రం చేసుకోవడం కొంత కష్టసాధ్యమైన పనిలా కనిపిస్తున్న తరుణంలో ఇల్లినాయిల్‌ వర్సిటీ పరిశోధకులు ఓ కొత్త, ప్రయోజనకర విషయాన్ని కనుగొన్నారు.

ఎలక్ట్రికల్‌ మల్టీ రైస్‌కుక్కర్‌లో ఎన్‌95 మాస్కులను వేస్తే ప్రభావవంతంగా శుభ్రం చేయవచ్చని తేల్చారు. 

ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం, ఉర్బానా-ఛాంపెయిన్ తాజా అధ్యయనం ప్రకారం.. ఎలక్ట్రిక్‌ కుక్కర్‌లో 50 నిమిషాలపాటు కలుషితమైన ఎన్‌95 మాస్కులను ఉంచితే అవి మళ్లీ వాడేందుకు పరిశుభ్రంగా తయారవుతాయి.

పూర్తిగా క్రిమిరహితం అవుతాయి. వీటిని నిరభ్యంతరంగా మళ్లీ ఉపయోగించుకోవచ్చు. 

సివిల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్లు తన్హ్ హెలెన్ గుయెన్‌, విశాల్‌వర్మ నేతృత్వంలో పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

ఈ అధ్యయన వివరాలు ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లెటర్స్‌ పత్రికలో ప్రచురితమయ్యాయి.