పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీలంక పీపుల్స్ పార్టీ(ఎస్ఎల్పీపీ) అధ్యక్షుడు మహింద రాజపక్స.. ప్రధానమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
దక్షిణ కొలొంబో, కెలానియా ప్రాంతంలోని చారిత్రక బౌద్ధ మందిరమైన రాజమాహా విహారయాలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది.
అయితే.. కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం జరగనున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
అనంతరం సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని స్పష్టం చేసింది.
ఆగస్టు 5న జరిగిన ఎన్నికల్లో మహింద.. అఖండ విజయం సాధించారు.
5 లక్షల వ్యక్తిగత ప్రాధాన్యం ఓట్లను కైవసం చేసుకొని చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.
ఎన్నికల్లో మహింద నేతృత్వంలోని ఎస్ఎల్పీపీ పార్టీ జయభేరీ మోగించింది.
రాజ్యాంగ సవరణకు కావాల్సిన మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని సాధించింది.
మొత్తం 225 పార్లమెంట్ స్థానాల్లో సంకీర్ణ పక్షాలతో కలిపి 150 సీట్లను గెలుచుకుంది.