స్పిన్ బౌలింగ్‌కు పర్యాయపదంలాంటి ఆటగాడు శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. అలాంటి స్పిన్ దిగ్గజం తొలుత ఫాస్ట్‌బౌలర్‌గా ఉండేవాడట. కానీ అండర్ 13 స్థాయిలో పొడుగ్గా లేడని భావించి తన కోచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు పనికి రావని చెప్పాడట. ఫాస్ట్ బౌలర్ అవ్వాల్సిన తాను ఆ మాటతో స్పిన్ బౌలర్‌గా మారానని చెప్పాడు. తాజాగా టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడిన మురళీధరన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా అశ్విన్ అడిగిన అనేక ప్రశ్నలకు తీరిగ్గా సమాధానమిచ్చాడు లంక స్పిన్నర్. అలాగే, సహజంగా ఆఫ్ స్పిన్నర్ అయిన తాను పాఠశాల స్థాయిలో ఆడేటప్పుడు లెగ్‌స్పిన్నర్‌గా కొనసాగినట్లు చెప్పాడు. అందుకు కారణం తమ స్కూల్లో అప్పటికే ఇద్దరు ఆఫ్‌స్పిన్నర్లు ఉన్నారని, తనకు అవకాశం వచ్చేందుకు వీలుగా బౌలింగ్‌ను మార్చుకున్నానని చెప్పాడు. అలా తాను ఆఫ్‌స్పిన్నర్ కంటే ముందు లెగ్‌స్పిన్నర్‌గానూ బౌలింగ్ చేసినట్లు వెల్లడించాడు. అనంతరం టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు మురళీధరన్ ఇలా అన్నాడు. చిన్న వయసులోనే ధోనీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడని, అయినా అతడిలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అన్నాడు. ఫీల్డర్లను సెట్ చేసుకోమని బౌలర్లకే అవకాశం ఇస్తాడని, అలాగే ఏ బౌలరైనా మంచి బంతులు వేస్తే అభినందిస్తాడని చెప్పాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఆ బంతులను సిక్స్‌గా మలిచినా పట్టించుకోడని గుర్తుచేసుకున్నాడు. మరోవైపు ఏదైనా సూచనలు చేయాలంటే మహీ అందరిముందు చెప్పకుండా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతాడన్నాడు. తద్వారా అతడికి ఏం కావాలో స్పష్టంగా వివరించి బౌలర్ల నుంచి అది రాబట్టుకుంటాడని తెలిపాడు. అలాంటి కారణాలతోనే సీఎస్కే కెప్టెన్ విజయవంతమయ్యాడని పేర్కొన్నాడు. ఎవరేం చెప్పినా వింటాడని, ఆటగాళ్లలో అతడు మ్యాచ్ విన్నర్లను చూస్తాడని మురళీధరన్ అన్నాడు. ఆ ఫార్ములాతోనే ఐపీఎల్‌లో చెలరేగుతున్నాడని స్పష్టంచేశాడు. ఇదిలా ఉండగా, మురళీధరన్ ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు తీసిన అతడు ఐపీఎల్‌లోనూ రాణించాడు. 66 మ్యాచ్‌ల్లో 63 వికెట్లు పడగొట్టాడు.
పొడవు లేకపోవడం వలన..
Related tags :