DailyDose

12న కరోనా పూర్తిస్థాయి వ్యాక్సిన్-TNI బులెటిన్

12న కరోనా పూర్తిస్థాయి వ్యాక్సిన్-TNI బులెటిన్

* కరోనా మహమ్మారి రోజురోజుకు జిల్లాలో పడగ విప్పుతోంది. రోజుకు వందకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో ఇళ్లలోనుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. కరోనా ప్రభావంతో వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. గడిచిన మూడు నెలలుగా అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో షాపుల యజమానులు ఉన్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే అప్పుల భారం తప్పదని ముందే మేలుకుని షాపులు ఖాళీ చేస్తున్నారు. చదువులు, వ్యాపారాల నిమిత్తం గ్రామాలు వదిలి పట్టణాలకు వచ్చి అద్దెకుఉంటున్న ఇంటి యజమానులు సైతంస్వగ్రామాలకు వెళుతున్నారు దీంతో ఖమ్మంతో పాటు ఉమ్మడి జిల్లాలోని మునిసిపల్‌ పట్టణాల్లో షాపులు ఖాళీ అవుతుండగా అపార్టుమెంట్లు, ఇళ్లు సైతం ఖాళీచేసి స్వగ్రామాల్లో సొంత ఇంటి బాటపడుతున్నారు.ఈ పరిస్థితి కారణంగా గత వారం పదిరోజులుగా ఖమ్మం పట్టణంతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర పట్టణాల్లో షాపుల ముందు టూలెట్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రోజువారి వ్యాపారాలతో వచ్చేలాభాలతో అద్దెలు చెలిస్తున్న యజమానులు మూడునెలలుగా టర్నోవర్‌ పడిపోవడం, కరెంట్‌బిల్లుల భారం, ఇటు ఇంటి అద్దెల నెలవారిగా యజమానులకు చెల్లించడం ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితి కలిగిస్తోంది. దీంతో షాపుల్లో ఉన్న సరుకు అమ్ముకుని షాపులు ఖాళీ చేస్తున్నారు. కొత్తగా పెట్టినవారు సైతం కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికి పోతున్నారు. టులెట్‌ బోర్డు పెట్టినా ఖమ్మంనగరంలో గతంలో గంటల్లోనే షాపులు బుక్‌ అయ్యేవి. ఇప్పుడు వైరారోడ్డుతోపాటు గాంధీచౌక్‌, బస్‌డిపోరోడ్డు, ఇలా ఏ వీధిలో టులెట్‌బోర్డు ఉన్నా కొత్తగా వచ్చి వ్యాపారాలు పెట్టేందుకు ఎవరూ ఇష్టపడడంలేదు. దీంతో ఖాళీగా టులెట్‌బోర్డులు దర్శనమిస్తున్నాయి. అపార్లుమెంట్లు, ఇతర ఇళ్లు సైతం టులెట్‌ బోర్డులు పెడుతున్నా కొత్తగా వచ్చేవారు కనిపించడంలేదు. పరిస్థితి తీవ్రంగా ఉండి కరోనాతో ఉద్యోగులు, వ్యాపారులు అన్నీ రంగాల ప్రజలు ఆర్థికగా చితికిపోతున్నా షాపుల యజమానులు ఇంటియజమానులు అద్దెలు తగ్గించడంలేదు.గతంలో ఉన్న అద్దెలే చెబుతూ అద్దెలు కడితేనే ఉండండి లేకపోతే ఖాళీచేయండని చెబుతున్నారు. ఈ పరిస్థితితో సామాన్యులు చిరువ్యాపారులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. చాలామంది పరిస్థితి గ్రహించి ఆర్థికభారం మోయలేక ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోతుండడంతో టులెట్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కరోనా ప్రభావం ఇదే పరిస్థితి కొనసాగితే ఇలా అపార్టుమెంట్లు, ఇళ్లలో అద్దెకు ఉంటున్న మరికొందరు ఖాళీచేసే పరిస్థితి ఉంది. అలాగే షాపులు నిర్వహిస్తున్న పలువురు వ్యాపారులు సైతం ఖాళీచేసి వ్యాపారాలకు స్వస్తిపలికే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంమీద కరోనా ప్రభావం అన్నీ రంగాలపై చూపిస్తుండడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా చితికిపోతున్నారు.

* ఈ నెల 4వతేదీన 50మందికోవిద్ అనుమానితులకు నిర్వహించిన వి .డి .ఆర్ .ఎల్ .పరీక్షలకు సంభందించి 10 మంది ఫలితాలు వచ్చాయి .వీరిలో 4 పాజిటివ్, 6గురు నెగటివ్ .నడిమి తిరువూరు వినాయకుడి గుడి వద్ద 1,కృషుడి గుడి ప్రాంతం లో 1,రాజుపేట 1,నగరపంచాయితీ పారిశుధ్య కార్మికుడు 1 .పాజిటివ్ గా నమోదు అయ్యారు .

* ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఈనెల 12న రష్యా అధికారికంగా చేయనుంది! మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న క్రమంలో అన్ని దేశాలూ కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే… తాము చివరి దశ పరీక్షలను పూర్తిచేసి, వచ్చే బుధవారం తొలి వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయనున్నట్టు రష్యా ప్రకటించింది. ఈ టీకాను గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు పూర్తిచేసుకుంటోంది.

* భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 64,339 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో 60వేల కేసులు దాటడం వరుసగా ఇది మూడోసారి. దీంతో ఆదివారం నాటికి దేశంలో మొత్తం కేసులసంఖ్య 21,53,000కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 14లక్షల 80వేల మంది కోలుకోగా మరో 6లక్షల 28వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 53వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 68శాతం దాటడం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 21రోజుల్లోనే రెట్టింపు అవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

* అగ్రి ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం ప్రగాఢ సంతాపం. మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి.