DailyDose

CRDAపై హైకోర్టుకు వెళ్లిన అశోక్‌బాబు-తాజావార్తలు

CRDAపై హైకోర్టుకు వెళ్లిన అశోక్‌బాబు-తాజావార్తలు

* CRDA రద్దు, రాజధాని వికేంద్రీకరణ చట్టాలను సవాలు చేస్తూ… హైకోర్ట్ లో MLC అశోక్ బాబు పిటిషన్అశోక్‌బాబు తరఫున తరఫున సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవి శంకర్‌, పవన్‌ కుమార్‌ అన్నాబత్తుని వాదించనున్నారు.ఈ పిటీషన్‌లో ఏడుగురిని ప్రతివాదిగా చేర్చారు.ఇందులో కేంద్ర హోం శాఖ, కేంద్ర న్యాయ శాఖను కూడా ప్రతివాదిగా చేర్చారు.ద ఆంధ్రప్రదేశ్‌ డీసెంట్రలైజేషన్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ ఆల్‌ రీజియన్స్‌ చట్టం 2020, ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం చెల్లదని పిటీషనర్‌ పేర్కొన్నారు.అలాగే సీఆర్డీఏ రద్దు చట్టం కూడా భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 200 ప్రకారం విరుద్ధమని పిటీషన్‌లో తెలిపారు.

* బెలారస్​లో నిరసన జ్వాలలు చెలరేగాయి. అధ్యక్ష ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు.ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషింకో అధికార దుర్వినియోగానికి పాల్పడి మరోమారు ఎన్నికయ్యేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.అధ్యక్ష ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఐరోపా దేశం బెలారస్‌లో హింస ప్రజ్వరిల్లింది.ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషింకో… అధికార దుర్వినియోగానికి పాల్పడి మరోమారు ఎన్నికయ్యేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు ఆందోళనకు దిగారు.రాజధాని మిన్‌స్క్ సహా బ్రెస్ట్ నగరంలో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి.ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు చోట్ల పోలీసులతో ‍ఘర్షణకు దిగారు.నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్‌ కేనన్‌లు, బాష్ప వాయువును ప్రయోగించారు.

* పాకిస్తాన్‌లోని చమన్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో సోమవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.నగరంలోని మాల్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనానికి పేలుడు పరికరం (ఐఈడీ) అమర్చి బ్లాస్ట్‌కు పాల్పడ్డారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.బ్లాస్ట్‌ జరుగడంతో సమీపంలోని మెకానిక్ దుకాణం పూర్తిగా ధ్వంసమైంది.భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు.అయితే ఈ బ్లాస్ట్‌ ఎవరు, ఎందుకు చేశారో అనే అంశంపై ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం చమన్ పేలుడును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 

* సత్తెనపల్లి పట్టణంలో పలు మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించిన అడిషనల్ ఎస్పీ అరిఫ్ హఫీజ్.శానిటైజర్ మరణల తర్వాత స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్న ఎ.ఎస్పి.లిక్విడ్ శానిటైజర్ కు బదులు, జల్ శానిటైజర్ అమ్మలని సూచించారు.మెడికల్ షాపుల వద్దఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే తెలిపలన్నరు.అనుమతులు లేకుండా ఎవరైనా శానిటైజర్ లేకుండా అమ్మిన, వాడుతున్న సమాచారాన్ని పోలీసులకు తెలపలన్నరు.శానిటైజర్ తయారీదారుల తో మెడికల్ షాపులు, అసోసియేషన్ తో మాట్లాడి అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్ చంద్ర తో పాటు పోలీసులు పాల్గొన్నారు.

* తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయా ధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు.తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు సోమవారం భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు.వర్చువల్‌ వేదికగా ఢిల్లీ నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 45వేల కోట్ల రూపాయలకు పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారని ఆరోపించారు.గడిచిన ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు చేసిందేంటో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు.తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారని నిలదీశారు.ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50వేల ఇళ్ళు కూడా కట్టలేదని జేపీ నడ్డా దుయ్యబట్టారు.‘కరోనాను కట్టడి చేయకుండా సీఎం‌ కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారు.

* మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా వైరస్‌ సోకింది. ఈమేరకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు పణబ్‌ ముఖర్జీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వారం రోజులుగా తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉంటూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ప్రణబ్‌ సూచించారు.

* ఇన్ఫెక్షన్‌ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే నీటి తుంపరలు కరోనా వైర్‌సకు వాహకాలుగా పనిచేస్తున్నాయి.అయితే ఈ వైరల్‌ తుంపరలకు అడ్డుకట్ట వేసి నిలువరించడంలో మాస్క్‌లు ఎంతమేర ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి? అనేది తెలుసుకునేందుకు అమెరికాలోని డ్యూక్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అతిచౌక పద్ధతిని అభివృద్ధి చేశారు.రూ.15వేలలోపు ధరకు లభించే ప్రత్యేక హార్డ్‌వేర్‌ కిట్‌ను ఇందుకు ఉపయోగించినట్లు తెలిపారు.అధ్యయనంలో భాగంగా 14 రకాల మాస్క్‌లతో జరిపిన టెస్టింగ్‌లలో ఎయిర్‌ వాల్వ్‌ లేని ఎన్‌95 మాస్క్‌, సర్జికల్‌ మాస్క్‌, హ్యాండ్‌మేడ్‌ కాటన్‌ ఫేస్‌ కవరింగ్‌లు తుంపరల నిరోధంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు.  

* చాలా ధైర్యంగా ఉన్నా..ఆందోళన అవసరం లేదుప్ర‌భుత్వ విప్‌ సామినేని ఉదయభానుకరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను చాలా ధైర్యంగా ఉన్నాన‌ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు.  సోమవారం ఆయన మాట్లాడుతూ..కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.తనకు జూలై 26వ తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు.తాను చాలా ధైర్యంగా ఉన్నానని, ప్రజలు ఎవరూ కూడా తన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.పద్నాలుగు రోజుల హోం ఐసొలేషన్ తర్వాత కరోనా పరీక్ష చేయించడంతో నెగిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు.త్వరలోనే మీ ముందుకు వస్తాను.కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉండి, భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.