WorldWonders

చైనా వైరస్‌కు చైనా వ్యక్తి ₹11కోట్ల మాస్క్

చైనా వైరస్‌కు చైనా వ్యక్తి ₹11కోట్ల మాస్క్

స్టేటస్ కు తగ్గట్టుగా.. 11.2 కోట్ల రూపాయలతో మాస్కు తయారు చేయించుకుంటోన్న వ్యాపారవేత్త!
మాస్కుల విషయంలోనూ వెరైటీగా ఆలోచిస్తున్న ధనవంతులు
అతి ఖరీదైన మాస్కును తయారుచేస్తున్న ఇజ్రాయెల్ కంపెనీ
ఆర్డర్ ఇచ్చిన అమెరికాలోని ఓ చైనా వ్యాపారవేత్త
పసిడి, వజ్రాలు పొదిగిన మాస్క్

కరోనా విజృంభణ కట్టడి కోసం ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో రకాల మాస్కులు అందుబాటులోకి వస్తున్నాయి. ధనవంతులు మాస్కుల విషయంలోనూ కాస్త వెరైటీగా ఆలోచిస్తున్నారు. తమ డాబు, దర్పాలను ప్రదర్శించడానికి అతి ఖరీదైన మాస్కుల కోసం ఆర్డర్లు ఇస్తున్నారు.

ఈ క్రమంలో అమెరికాలో నివసిస్తోన్న ఓ చైనా వ్యాపారవేత్త ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును ధరించాలని యోచిస్తూ, దాన్ని ఆర్డర్ చేశారు. టాప్ రేటెడ్ ఎన్ 99 ఫిల్టర్లు, పసిడి, వజ్రాలు పొదిగిన మాస్క్ ను తయారు చేయాలని కోరారు. సుమారు 11.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ఆ చైనా వ్యాపారి ఈ మాస్కును తయారు చేయించుకుంటున్నారు.

జెరూసలేంలో ఓ ఆభరణాల సంస్థలో పనిచేస్తోన్న డిజైనర్ ఐజాక్ లెవీ ఈ విషయాన్ని వెల్లడించారు. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో దీన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. మాస్కు చుట్టూ 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి దీని తయారీని పూర్తి చేస్తామని తెలిపారు.