NRI-NRT

Breaking: శ్వేతసౌధం వద్ద కాల్పులు. ఒకరి పరిస్థితి విషమం

Firing And Gun Shots - Man Killed At White House

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ పచ్చికలకు అతిసమీపంలో ఓ దుండగుడు రెండుసార్లు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన వైట్‌హౌజ్ బలగాలు మరో ఆలోచన లేకుండా అతడిపై తూటాల వర్షం కురిపించారు. అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ట్రంప్ నేటి సాయంకాలం ఓ పత్రికా సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా సీక్రెట్ సర్వీసు అధికారి ఒకరు వచ్చి ఆయనకు జరిగింది చెప్పారు. తాను భయపడుతున్నానా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు…నేను అలా కనిపిస్తున్నానా అని ట్రంప్ ఎదురు ప్రశ్న వేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. నిందితుడికి ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు