Editorials

రామోజీరావుకు సుప్రీం నోటీసులు

రామోజీరావుకు సుప్రీం నోటీసులు

మార్గదర్శి కేసులో రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది.

ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది.

కాగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో హెచ్‌యుఎఫ్ (హిందూ జాయింట్‌ ఫ్యామిలీ) వ్యక్తుల సమూహం కాదని, ఆర్బీఐ నిబంధనలు వర్తించవని ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు జస్టిస్‌ రజిని రామోజీరావుపై కేసును కొట్టివేశారు. 

ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుతం ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఇంప్లీడ్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.