సువెన్ లైఫ్‌సైన్సెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.10.48 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించింది. త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.3.95 కోట్లు ఉంది. ఇందులో రూ.2.52 కోట్లు ఇతర ఆదాయం కాగా, వ్యాపార ఆదాయం రూ.1.42 కోట్లు మాత్రమే. ఈ కంపెనీ నుంచి గత ఏడాదిలో సువెన్ ఫార్మాసూటికల్స్ విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సువెన్ లైఫ్‌సైన్సెస్ ప్రధానంగా ఔషధ పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి అమెరికాలో క్లినికల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు నిర్వహించే సువెన్ న్యూరోసైన్సెస్ ఇంక్., సబ్సిడరీ కంపెనీగా ఉంది. సువెన్- 502, సువెన్-జీ3031 అనే మాలిక్యూల్స్‌పై సువెన్ లైఫ్‌సైన్సెస్ గత కొన్నేళ్లుగా క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తోంది. సువెన్- 502 మాలిక్యూల్‌ను మతిమరుపు వ్యాధిని అదుపు చేసే ఔషధంగా అభివృద్ధి చేయటానికి ప్రయోగాలు నిర్వహిస్తుండగా, సువెన్- జీ3031 ను ‘స్లీప్ డిజార్డర్’ వ్యాధి కోసం పరీక్షిస్తున్నారు.
సువెన్ లైఫ్‌సైన్సెస్ లాభాలు మటాష్
Related tags :