* కరోనా వైరస్ టీకాను ప్రజలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది రష్యా. నిజానికి ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ఇదో సంచలన వార్త. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇన్ని రోజులు వ్యాక్సిన్ కోసం ఎదురుచూసిన ప్రపంచ దేశాలు రష్యా ప్రకటనపై సంబరపడకుండా.. వైరస్ సురక్షితమేనా? కాదా? అని ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు కారణమేంటి?మూడో దశ ముగియకుండానే…ఆగస్టులో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని గత నెల నుంచే రష్యా స్పష్టంగా చెబుతోంది. దాన్ని నిజం చేస్తూ.. తాము అభివృద్ధి చేసిన టీకాను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. కానీ రష్యా వ్యాక్సిన్‌పై సొంత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడో దశ ట్రయల్స్ నిర్వహించకుండానే వ్యాక్సిన్‌ను ఎలా విడుదల చేస్తారని రష్యాకు చెందిన శాస్త్రవేత్తలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మూడో దశ పూర్తవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని.. వేల సంఖ్యలో ప్రజలపై పరీక్షలు నిర్వహించాలని చెబుతున్నారు. అలాంటిది.. ట్రయల్స్ పూర్తిగా జరగకుండానే వ్యాక్సిన్‌ను విడుదల చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.వీటన్నిటితో పాటు రష్యా వ్యాక్సిన్‌పై మరో విషయంలోనూ ప్రజల్లో భయాందోళన నెలకొంది. వ్యాక్సిన్‌ను విడుదల చేస్తున్నట్టు పుతిన్ ప్రకటించినప్పటికీ.. ట్రయల్స్‌కు సంబంధించి జరిగిన పరీక్షల ఫలితాలపై ఎలాంటి వివరాలు లేవు. ఎంత మందిపై వ్యాక్సిన్ ట్రయల్స్ జరిపారనేది ఇంకా తెలియదు.’అంతా బాగానే ఉంది…’కానీ రష్యా అధ్యక్షుడు ఈ ప్రశ్నలన్నింటినీ తోసిపుచ్చుతూ వ్యాక్సిన్ విడుదలపై ప్రకటన చేశారు. ప్రజలకు టీకా వేసే ముందు చేయాల్సిన పరీక్షలన్నీ ఈ వ్యాక్సిన్‌పై జరిపినట్టు స్పష్టంచేశారు. తన సొంత కుమార్తె.. ఈ వ్యాక్సిన్ తీసుకుని ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు.”ఈ వ్యాక్సిన్ అన్ని పరీక్షలను పూర్తి చేసుకుంది. వ్యాక్సిన్ ఎంత సురక్షితమైనదనే విషయమే అత్యంత కీలకం. దాని సమర్థత కూడా ముఖ్యమే. నా ఇద్దరు కుమార్తెల్లో ఒకరు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండు డోసులు ఇచ్చారు. ఆమె ఆరోగ్యంగానే ఉంది. మొదటి డోసు ఇచ్చినప్పుడు 38 డిగ్రీలుగా ఉన్న శరీర ఉష్ణోగ్రత 37కు తగ్గింది. రెండో డోసు సమయంలో ఉష్ణోగ్రత కొంత పెరిగి జ్వరం వచ్చింది. ఆ తర్వాత అంతా మాములుగా మారిపోయింది.”— వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు.అయితే వ్యాక్సిన్ తీసుకున్న కమార్తె పేరును మాత్రం పుతిన్ బయటపెట్టలేదు.భారీ స్థాయిలో ఉత్పత్తిఅక్టోబర్ నాటికి వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది రష్యా. పలు దేశాలు ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపిస్తున్నట్టు ప్రధానమంత్రి మిఖైల్ మురాస్కో వెల్లడించారు.రష్యా వ్యాక్సిన్‌ను గమలేయా రీసర్చ్ ఇన్స్టిట్యూట్, దేశ రక్షణశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ టీకాకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభమయ్యాయి. ఇందులో 38 మంది వలంటీర్లు పాల్గొన్నారు. అందరిలోనూ రోగనిరోధక శక్తి పెరిగింది. వీరు జులై 15, 20వ తేదీల్లో డిశ్చార్జ్ అయ్యారు.
* కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్… పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసిందన్నారు.. కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందన్న ఆయన… వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలన్నారు. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక వేయాలి. కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలి. గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు.. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు.. దీనిని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు కేసీఆర్.
* స్కూళ్లు ప్రారంభమైన రెండు వారాల్లోనే 97 వేల మంది చిన్నారులకు కరోనా★ కరోనా వైరస్ నుంచి కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కాస్తంత కోలుకుంటున్నాయి.★ దీంతో ఈ విద్యా సంవత్సరం స్కూళ్లను తెరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.★ అయితే అలా స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయో లేదో అప్పుడే చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు.★ ముఖ్యంగా అమెరికాలో గడచిన రెండు వారాల్లో ఒక్క అమెరికాలోనే 97 వేల మంది చిన్నారులు కరోనా వైరస్ బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది.★ జూలై 16 నుంచి జూలై 30 మధ్య దాదాపు లక్ష మంది పిల్లలకు వ్యాధి సోకిందని… దీంతో స్కూళ్లను తిరిగి తెరిపించడంపై అధికారులు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.
* కోవిడ్ టీకా.. ఏడాదికి ఒకటా?త్వరలో వ్యాక్సిన్ అంటున్ననేపథ్యంలో కొత్త సందేహాలుఫ్లూ వైరస్ తరహాలోనే ఇది జీవితాంతం పనిచేయదనే అనుమానాలుకరోనా వైరస్‌లో మార్పులు ఎక్కువగా ఉండటమే కారణంహైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ వ్యాక్సిన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ఇదిగో వ్యాక్సిన్ అదిగో వ్యాక్సిన్ అంటూ వివిధ దేశాల్లోని పరిశోధన సంస్థలు చేస్తున్న ప్రకటనలతో సామాన్య జనంలో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, ఆ వచ్చే వ్యాక్సిన్ జీవితకాలం ఎంత అనే విషయంలోనే ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. దాని శక్తి ఒక ఏడాదికే పరిమితమైనా ఆశ్చర్యపోనవసరంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
* రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యానికి వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నిటినీ ఇకపై 24 గంటలూ పనిచేయించాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల వారు అనారోగ్యంతో ఏ సమయంలో వచ్చినా 24 గంటలూ వైద్యులను అందుబాటులో ఉంచనుంది. ఇప్పటివరకు 24 గంటలూ పనిచేసే పీహెచ్‌సీలు 520 మాత్రమే ఉండగా.. ఇప్పుడు మరో 625 పీహెచ్‌సీలను కలిపి మొత్తం 1,145ను 24 గంటలూ పనిచేసేలా మార్చనుంది. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి