* నిర్బంధంపై గతంలో ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై పోలీసులు కూడా కౌంటర్ వేశారు. పోలీసుల కౌంటర్ మీద అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు, గుంటూరు సీసీఎస్ పోలీసుల పాత్రపై సీబీఐ విచారణకు ఆదేశించింది.గుంటూరు అర్బన్ పోలీసులుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఓ కేసుకు సంబంధించి అక్రమ నిర్బంధంపై కేసు ఫైల్ చేశారు. నల్లబోలు సునీత, రాయిది నాగలక్ష్మి, తుమ్మటి విజయలక్ష్మిలు తమ భర్తల్ని అక్రమంగా నిర్బంధించారని పోలీసులపై కేసు పెట్టారు. అలాగే నిర్బంధంపై గతంలో ఏపీ హైకోర్టులోహెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై పోలీసులు కూడా కౌంటర్ వేశారు. పోలీసుల కౌంటర్ మీద అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు, గుంటూరు సీసీఎస్ పోలీసుల పాత్రపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీబీఐ తమ దర్యాప్తు మొదలుపెట్టింది.ముగ్గుర్ని నిర్బంధంచడం.. పట్టాభిపురం స్టేషన్ వద్ద మహిళల పట్ల సీఐ కళ్యాణ రాజు అమానుషంగా వ్యవహరించాడని లాయర్ కోర్టుకు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఎస్పీ రామకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన కారకుడు సీఐ కళ్యాణ రాజుపై కూడా కేసు నమోదు చేయాలని న్యాయవాది మాగులూరి హరిబాబు డిమాండ్ చేశారు. సీబీఐ రంగంలోకి దిగడం కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది.
* అగ్ని ప్రమాదం ఘటనలో నిందితులకు రిమాండ్‌విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో అరెస్టయిన ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ముందు పోలీసులు హజరు పరిచారు.ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఇన్‌చార్జి, ఆస్పత్రి జీఎం డాక్టర్ కె.సుదర్శన్, కోవిడ్ కేర్ సెంటర్ కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లెపోతు వెంకటేశ్‌లకు 14 రోజుల రిమాండ్ విధించారు.నిందితులను మచిలీపట్టణం స్పెషల్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు.విజయవాడ రమేశ్ ఆస్పత్రి.. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్యం, కనీస భద్రతా చర్యలు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు.
* జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో భారీ చోరీ జరిగింది.పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ ఇంట్లో దుండగులు పెద్ద ఎత్తున చోరీకి తెగబడ్డారు.ఎండి చేపల వ్యాపారి మంగపాటి లక్ష్మీ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ట్రంక్ పెట్టలో దాచిన రూ.3 లక్షల నగదను అపహరించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి ప్రేరేపించింది. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగగా రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో సిటీలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాలు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు షేర్ చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన కొంతమంది వ్యక్తులు అతడిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎమ్మెల్యే అండతోనే అతడు ఇలా చేస్తున్నాడని భావించి మంగళవారం రాత్రి కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అంతేగాక ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది పట్ల కూడా నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన అల్లరి మూక పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అనేక హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాలు అయినట్లు తెలిపారు.ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 110 మందిని అరెస్టు చేశామని బెంగళూరు జాయింట్ కమిషనర్(క్రైం) సందీప్ పాటిల్ తెలిపారు. అదే విధంగా వివాదాస్పద పోస్టుతో ఘర్షణ వాతావారణానికి మూల కారణమైన నవీన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషను పరిధిలో కర్ఫ్యూ విధించామని, బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడినట్లు పేర్కొన్నారు.