NRI-NRT

NRIలకు కరోనా మినహాయింపులు-TNI బులెటిన్

NRIలకు కరోనా మినహాయింపులు-TNI బులెటిన్

* విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం కాస్త సడలించిందికరోనా సోకలేదని ధ్రువీకరించేలా వ్యాధి నిర్ధారణ పరీక్ష రిపోర్టును సమర్పించేవారికి వ్యవస్థాగత (ఇన్‌స్టిట్యూషనల్‌) క్వారంటైన్‌ నుంచి మినహాయింపునిచ్చింది.భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి 96 గంటల్లోపు చేసుకున్న పరీక్షకు సంబంధించిన రిపోర్టునే ప్రయాణికులు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. తప్పుడు నివేదికలు సమర్పిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.కుటుంబ సభ్యులు చనిపోవడం, తీవ్ర అనారోగ్యం, గర్భం, పదేళ్లలోపు కుమారులు/కుమార్తెలు ఉండటం వంటి తప్పనిసరి కారణాలతో భారత్‌కు వచ్చేవారు ఇకపై 14 రోజుల హోం క్వారంటైన్‌ను ఎంచుకోవచ్చునని కూడా అందులో పేర్కొంది. ఇందుకోసం భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి కనీసం 72 గంటల ముందు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిందివిమానాలు, నౌకల ద్వారా భారత్‌కు వచ్చేవారంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత.. కరోనా లక్షణాలేవీ లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.

* ప్రపంచంలోనే వేగవంతమైన కరోనా టెస్ట్‌ కిట్.. ఇప్పుడు భారత్ లో..!దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.ఈ క్రమంలో ప్రపంచంలోనే వేగవంతమైన కరోనా టెస్ట్‌ కిట్‌ను ప్రముఖ గ్లోబల్‌ బయోటెక్నాలజీ సంస్థ జెన్‌స్క్రిప్ట్ భారత మార్కెట్‌లోకి‌ లాంచ్‌ చేసింది.ఇందుకోసం ప్రేమాస్ లైఫ్ సైన్సెస్‌తో జతకట్టింది. సీ పాస్‌ సార్స్‌ సీవోవీ-2 న్యూట్రలైజేషన్‌ యాంటీబాడీ డిటెక్షన్‌ కిట్‌గా పిలిచే దీనిని సింగపూర్ ఏజెన్సీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ నుంచి డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ సింగపూర్, డయాగ్నోస్టిక్స్ డెవలప్‌మెంట్ హబ్‌తో కలిసి అభివృద్ధి చేశారు.మరోవైపు.. కరోనా పరీక్షలకు వాడే కిట్లలో ఇది ప్రపంచంలోనే మొదటి వేగవంతమైన పరీక్షా కిట్.ఇది ఒక గంటలోపు తటస్థీకరించే ప్రతిరోధకాలను కొలవగలదు. దీనిని జెన్‌స్క్రిప్ట్ బయోటెక్ కార్పొరేషన్‌ తయారుచేస్తుంది.ఇది ప్రస్తుత కొవిడ్‌-19 పరిశోధనలు, సెరో-ప్రాబల్యెన్స్ సర్వే, హెర్డ్‌ ఇమ్యూనిటీపై పరిశోధన, దీర్ఘాయువు తటస్థీకరించే ప్రతిరోధకాలు, టీకా వేయించుకునే అభ్యర్థుల సామర్థ్యాన్ని రక్షించడంలాంటి వాటికి ఊతంగా నిలుస్తుంది.సాంప్రదాయిక లైవ్ వైరస్ పరీక్షా కిట్‌ల మాదిరిగా కాకుండా గ్లోబల్ కమ్యూనిటీ సీపాస్‌ను ఉపయోగించగలదు.

* దేశంలో నమోదవుతున్న కేసుల్లో వందకు పది మంది ఆంధ్రులే ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఏపీలో కరోనా అదుపు తప్పుతోందన్న కోవిడ్ ఇండియా వెబ్‌సైట్ హెచ్చరిక మీకు కనబడుతోందా అని ట్విట్టర్ వేదికగా దేవినేని ఉమ ప్రశ్నించారు.

* రాష్ట్రంలో ఈ రోజు 1897 కేస్ లు.84544 కి చేరిన మొత్తం కారోనా కేస్.1920 మంది తాజాగా కొలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 61294 కి చేరింది.9 మంది మృతి 654 కి చేరిన మొత్తం మృతుల సంఖ్య.22596 యాక్టీవ్ కేస్ లు.15534 మంది ఐసోలాషన్ లో వున్నారుజీహెచ్ఎంసీ 479, మేడ్చల్ 172 , రంగారెడ్డి 162, సంగరెడ్డి 107, వరంగల్ అర్బన్ 87