Agriculture

దోమలు బాబోయ్…దోమలు

దోమలు బాబోయ్…దోమలు

అసలే వానకాలం. దోమలు.. వాటితోపాటు వ్యాధులు కూడా ప్రబలే సమయం. ఇంటి చుట్టుపక్కల, పెరట్లో నీరు నిల్వ ఉంటే దోమల వ్యాప్తి పెరుగుతుంది. ఫలితంగా మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యాతోపాటు అనేక రకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నది. అయితే, ఇంటి పెరట్లో కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల దోమల్ని నిరోధించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా తులసి, లెమన్‌ గ్రాస్‌లాంటి ఔషధ మొక్కల పెంపకంతో దోమల్ని తరిమేయడంతోపాటు కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు. తులసి మొక్కల్లో రామ తులసి, కృష్ణ తులసి, వన తులసిలాంటి ఐదారు రకాలుండగా, కృష్ణ తులసి ప్రత్యేకమైంది. దీని నుంచి వచ్చే ఘాటైన వాసన, దోమలను తరిమేస్తుంది. ఇంటి వరండాల్లో లెమన్‌ గ్రాస్‌ మొక్కలను పెంచడం వల్ల దోమలను అడ్డుకోవచ్చు. ఇవే కాకుండా లావెండర్‌, సిట్రోనెల్లాలాంటి మొక్కలు కూడా దోమలను నివారిస్తాయి.