ScienceAndTech

మోటోరేజర్ Foldable 5G వచ్చేసింది

మోటోరేజర్ వచ్చేసింది

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి ‘మోటో రేజర్‌ 5జీ’ పోల్డబుల్‌ ఫోన్‌ విడుదల కానుంది. ఇది తమ కంపెనీ నుంచి రానున్న తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ అని సంస్థ తెలిపింది. కాగా, మడత పెట్టుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో సరికొత్త ఫీచర్లు ఇలా ఉన్నాయి.
ఈ ఫోన్‌ ప్రత్యేకతలు :
* 48 మెగా ఫిక్సల్‌ ఐసోసెల్‌ బ్రైట్‌ జీఎం1 కెమెరా
* 20 మెగా ఫిక్సల్‌ సెల్ఫీ షూటర్‌
* 6.2 అంగుళాల డిస్‌ప్లే
* 8 జీబీ ర్యామ్‌,
* 256 జీబీ ఇంటర్నల్‌ మెమోరీ సామర్థ్యం
* 2845 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* 765 క్వాల్‌కామ్‌‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రొసెసర్లతో పనిచేసే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 10 సిస్టమ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. అయితే, గతంలో కంపెనీ విడుదల చేసిన మోటో రేజర్‌ డ్యూయెల్‌ డిస్‌ప్లే ఫోన్‌ మాదిరిగానే, తాజా మోటో రేజర్‌ 5జీ ఫోన్‌ ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న జరగనున్న ఈ వర్చువల్‌ ఈవెంట్‌ కోసం మోటోరోలా ఏర్పాట్లు చేస్తోంది.