Food

హెర్బల్ టీతో రోగనిరోధకత పెంపు

హెర్బల్ టీతో రోగనిరోధకత పెంపు

ఇప్పుడున్న‌ జెన‌రేష‌న్‌కి టీ, కాఫీల గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. రోజుకు ఒక‌టి లేదా రెండుసార్లు తాగితే మంచిదే. అదే సంఖ్య పెరిగితే ఆరోగ్యానికే ముప్పు వాటిల్లుతుంది. అందుక‌ని టీకి కాస్త దూరంగా ఉండాలి అనుకుంటారు. కానీ వారివ‌ళ్ల కాదు. అందుక‌నే వాటి స్థానంలోకి హెర్బ‌ల్ టీని చేర్చుకోండి. దీంతో ఆరోగ్య‌మే కాని అనారోగ్యం అన్న మాటే రాదు. మ‌రి రోగనిరోధ‌క శ‌క్తిని పెంచే ఈ హెర్బ‌ల్ టీ వ‌ల్ల ప్ర‌యోజ‌నాలేంటో ఒక‌సారి తెలుసుకోండి. ఈ రోజుల్లో చాలామంది నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్నారు. వారు చామోమిల్ టీ, లావెండర్ టీతో చేసిన హెర్బ‌ల్ టీ తాగితే ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఇది ఒత్తిడిని త‌గ్గించి. మ‌న‌సుని ప్ర‌శాంతంగా ఉంచుతుంది.
హెర్బ‌ల్ టీ కిడ్నీ, లివ‌ర్ మీద ఉన్న ఒత్తిడిని త‌గ్గిస్తుంది. ఆ ప్ర‌దేశంలో పేర్కొన్న టాక్సిన్స్‌ని బ‌య‌టికి పంపిస్తాయి. చామోమిల్ టీ, కావా రూట్ టీలు అంటే ఐడియా ఉందా.. ఇది ఒత్తిడిని త‌గ్గించ‌డంతోపాటు యాంగ్జైటీని తగ్గిస్తుంది. డిప్రెష‌న్‌కు గురికాకుండా కాపాడుతుంది. అల్లం టీ, ప‌సుపు టీ ఇన్‌ఫ్ల‌మేష‌న్‌ను త‌గ్గిస్తాయి. త‌ల‌నొప్పి, ఆర్థ్రైటిస్ వ‌ర‌కూ అనేక స‌మ‌స్య‌ల‌ను కంట్రోల్ చేయ‌డానికి ఈ టీలు ఉప‌యోగ‌ప‌డుతాయి. అల్లం టీ, పుదీనా టీ తాగ‌డంతో బ్రెయిన్ హెల్త్‌ను ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ల‌వుతారు. హెర్బ‌ల్ టీ అరుగుద‌ల‌కు ఎంతో తోడ్ప‌డుతుంది. బ్లోటింగ్‌, వికారం, కాన్‌స్టిపేష‌న్‌, అజీర్ణం వంటి వాటికి మేలు చేస్తుంది. ఫ్రీ రాడిక‌ల్స్‌తో పోరాడి శ‌రీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని త‌గ్గించ‌డానికి హెర్బ‌ల్ టీ ఉప‌యోగ‌ప‌డుతుంది. పెప్ప‌ర్మింట్ టీ ఇందుకోసం ప‌నిచేస్తుంది. హెర్బ‌ల్ టీలో టీ ఆకులు ఉండ‌వు. తిన‌డానికి ప‌నికొచ్చే ఆకులు, పువ్వులు, ప‌ళ్లూ, వేర్లూ వంటివి ఉంటాయి. ఇవే కాదు వీటితోపాటు కొన్ని స్పైసెస్‌ని కూడా జోడించి మ‌ర‌గ‌బెట్టి డికాష‌న్‌తో త‌యారు చేస్తారు. దీన్నే హెర్బ‌ల్ టీ అంటారు. వీటిలో కొన్ని వంద‌ల ర‌కాలు అందుబాటులో ఉంటాయి. ప్ర‌తిఒక్క‌రికీ ద‌గ్గ‌ర‌గా ఉండే క‌రివేపాకుతో కూడా టీ చేసుకోవ‌చ్చు. ఈ విధంగా ద‌గ్గ‌ర‌గా ఏవి అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవ‌చ్చు. మ‌రి ఇంకేం క‌రోనా టైంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి కోస‌మైనా ఈ టీ తాగాల్సిందే!