Health

సిగరెట్లు తాగండి. యముడిని 10ఏళ్లు ముందుగా కలుసుకోండి.

సిగరెట్లు తాగండి. యముడిని 10ఏళ్లు ముందుగా కలుసుకోండి.

ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం. ఈ మాట చెప్పేవాళ్లే ఎక్కువ‌గా తాగుతుంటారు. హా.. నేనెన్ని తాగుతాను. రోజుకి ఒక‌టే క‌దా అనుకుంటారు. ఆ ఒక‌టి కాస్త రెండు. రెండు కాస్త మూడు పూటల భోజ‌నంలా మూడుసార్లుగా మారుతుంది. ఇలా కౌంట్ పెంచుకుంటూ పోతే వారి ఆయుష్షును వారే త‌గ్గించుకున్న‌ట్లు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధూమ‌పానం చేయ‌డం వ‌ల్ల శారీర‌కంగా న‌ష్ట‌పోవ‌డ‌మే కాకుండా మాన‌సికంగా ఆర్థికంగా కూడా న‌ష్ట‌పోతారంటున్నారు. దీనివ‌ల్ల మ‌ర‌ణాన్ని కొనితెచ్చుకున్న‌ట్లే. ఇవి వ‌ట్టి మాట‌లు కాదు. దీని మీద ప‌రిశోధ‌న జ‌రిపిన త‌ర్వాతే నిర్థారించారు.ఆస్ట్రేలియాకు చెందిన ఓ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు దీనికో‌సం 1,52,483 మంది రోగులను సంద‌ర్శించారు. పొగతాగేవారిలో 28 ర‌కాల రోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. పొగ తాగ‌ని వారితో కంపేర్ చేసి చూస్తే 30 శాతం అధికంగా రోగాల బారిన ప‌డుతున్నార‌ని తేల్చి చెప్పారు. దీనికి తోడు ఉన్న ఆయుష్షులో 10 ఏండ్లు ముందే మ‌ర‌ణిస్తారంటున్నారు. సిగ‌రెట్ వ‌ల్ల క్యాన్స‌ర్‌, శ్వాస‌, హృద్రోగాలు, కిడ్నీలు, న్యుమోనియా, కంటి, ర‌క్త సంబంధిత వ్యాధుల బారినప‌డ‌తార‌ని పేర్కొన్నారు.