* Singer S.P. Balasubrahmanyam (#SPB) has been moved to ICU. He is on life support and his condition remains critical, says hospital.
* కోవిడ్–19 చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని హైదరాబాద్ కంపెనీ ఎంఎస్‌ఎన్ గ్రూప్ తయారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను అత్యంత చౌకగా విక్రయిస్తోంది. ఒక్కో ట్యాబ్లెట్ ధరను రూ.33గా కంపెనీ నిర్ణయించింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్, ఫార్ములేషన్‌ను సొంత పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో రూపొందించామని ఎంఎస్‌ఎన్ గ్రూప్ సీఎండీ ఎంఎస్‌ఎన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నాణ్యమైన మందులు అందరికీ చవకగా అందుబాటులో ఉండాలని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కంపెనీ కోవిడ్–19 చికిత్సలో వాడే ఓసెల్టామివిర్ 75 ఎంజీ క్యాప్సూల్స్‌ను ప్రవేశపెట్టింది. డిమాండ్‌కు తగ్గట్టుగా…: ఫావిలో 400 ఎంజీ ట్యాబ్లెట్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఈడీ భరత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘డిమాండ్‌కు తగ్గట్టుగా ఫావిలో సరఫరా చేయగలిగే సామర్థ్యం కంపెనీకి ఉంది. ప్రస్తుతం బొలారం ప్లాంటులో దీనిని తయారు చేస్తున్నాం. డిమాండ్ అధికమైతే కొత్తూరు యూనిట్లో కూడా ఉత్పత్తి చేస్తాం’ అని వివరించారు. 2003లో ప్రారంభమైన ఎంఎస్‌ఎన్ గ్రూప్‌నకు తెలంగాణలో 11 ఏపీఐ, మూడు ఫార్ములేషన్ యూనిట్లున్నాయి. యూఎస్‌లో ఒక ఫార్ములేషన్ కేంద్రం ఉంది. 11,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 560 డ్రగ్ మాస్టర్ ఫైల్స్, 370 ఏపీఐలు కంపెనీ ఖాతాలో ఉన్నాయి
* కొత్తగా 64,553 కరోనా కేసులు.. 1007 కరోనా పాజిటివ్ మరణాలుగడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్ కేసులు నమోదు.దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24,61,190గడిచిన 24 గంటల్లో 1007 కరోనా పాజిటివ్ మరణాలుఇప్పటి వరకూ కరోనా తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040గడిచిన 24 గంటల్లో 55,573 మంది కరోనా నుంచి కోలుకో ని వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్.ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,51,555కప్రస్తుతం దేశంలో 6,61,595 యాక్టివ్ కేసులు
* కేరళలోని కొలికోడ్ విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారిలో.. జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులకు కరోనా వైరస్ సోకింది. గత శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం అనంతరం సహాయక చర్యల్లో పాల్గొన్న మలప్పురం జిల్లా కలెక్టర్ గోపాల కృష్ణన్‌తో పాటు మొత్తం 22 మంది అధికారులకు కరోనా సోకినట్టు వైద్యాధికారులు తెలిపారు. వారిని క్వారంటైన్ కేంద్రంలో చేర్చినట్లు వివరించారు.
* రష్యా.. అమెరికా మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది.. ఇటీవల కొవిడ్-19పై తొలిటీకాను విడుదల చేసిన రష్యా ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. టీకాను తయారు చేసే ఆపరేషన్ ‘రాప్ స్పీడ్’కు తాను సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని రష్యాలోని అధికారులు ఆంగ్లవార్త ఛానల్ సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. కానీ, ఈ ఆఫర్‌ను అమెరికా తిరస్కరించిందని పేర్కొన్నారు. కొవిడ్‌పై టీకాను, చికిత్సను ఆవిష్కరించేందుకు పలు ఏజెన్సీలను సమన్వయం చేస్తూ ఈ ఆపరేషన్ చేపట్టారు. ‘‘ రష్యాపై ఉన్న అపనమ్మకం వల్ల వారు మా టీకా, టెక్నాలజీ, పరీక్షా విధానాన్ని వాడుకోరు’’ అని ఓ రష్యా అధికారి పేర్కొన్నారు. దీనిపై శ్వేతసౌధం ప్రెస్ కార్యదర్శి మెక్నాని మాట్లాడుతూ.. గురువారం తమకు టీకాపై అధ్యక్షుడు ట్రంప్ సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. అమెరికా తయారు చేస్తున్న టీకా ఫేజ్-3లో కఠిన పరీక్షలను ఎదుర్కొని మంచి ప్రమాణాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.