Politics

తెలంగాణా నుండి తన విజన్‌పై చంద్రబాబు స్వోత్కర్ష

తెలంగాణా నుండి తన విజన్‌పై చంద్రబాబు స్వోత్కర్ష

ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కష్టకాలంలో తాను సీఎంగా ఉంటేనే ప్రగతి సాధ్యమని నమ్మిన ప్రజలు 2014లో తనకు అధికారం ఇచ్చారని అన్నారు. అందుకే ఒక విజన్‌ తయారు చేసుకొని ముందుకెళ్లామని చంద్రబాబు తెలిపారు. 2022 నాటికి అత్యున్నత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని, అమరావతిలో 9 సిటీలు అభివృద్ధి చేయాలని అనుకున్నామని చెప్పారు. ఏపీ రాజధాని, రాష్ట్ర పరిస్థితులపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. ‘‘అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల కల. అమరావతికి పూర్తిగా సహకరిస్తానని ఆనాడు జగన్‌ చెప్పారు. అన్ని పుణ్యక్షేత్రాల నుంచి జలం, మట్టి తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. రాజధానిగా అమరావతే ఉండాలని 50శాతం కంటే ఎక్కువమంది ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి.. అందరికీ ఆమోదయోగ్యమైన, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు అనుకూలమైన ప్రాంతం’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.