జాబిలిపై చంద్రయాన్2 కనుగొన్న ఓ అగ్నిపర్వత బిలానికి ఇస్రో శాస్ర్తవేత్తలు భారత అంతరిక్ష పితామహుడు విక్రం సారాభాయ్ పేరు పెట్టారు. సారాభాయ్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు ఆయనకు ఘన నివాళి ఇచ్చారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ప్రశంసించారు. ఇస్రో సాధించిన విజయాలు సారాభాయ్ దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. అమెరికాకు చెందిన అపోలో17, లూనార్21 మిషన్‌లు దిగిన ప్రాంతానికి తూర్పున 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో సారాభాయ్ బిలం ఉన్నట్లు శాస్ర్తవేత్తలు తెలిపారు. సారాభాయ్ బిలం సుమారు 1.7కిలోమీటర్ల లోతును కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. లావాతో నిండిన చంద్రుడి ప్రాంతాన్ని మరింత అర్థం చేసుకోవడానికి సారాభాయ్ బిలం ఉపకరిస్తుందని ఇస్రో తెలిపింది.
చంద్రయాన్ ఆవిష్కరణకు విక్రమ్ సారభాయ్ పేరు
Related tags :