WorldWonders

విశాఖలో పుర్రె వేపుడు ఆరగించిన సైకో

విశాఖలో పుర్రె వేపుడు ఆరగించిన సైకో

విశాఖలో పుర్రె కలకలం… ఫ్రై చేసి తింటూ కనిపించిన సైకో…విశాఖపట్నం జిల్లా… రెల్లి వీధి. రెగ్యులర్‌గా ప్రజలు తిరిగేదే. ఇప్పుడైతే… మాస్కులు పెట్టుకొని జాగ్రత్తగా దూరం దూరంగా ఉంటూ తిరుగుతున్నారు. అలాంటి చోట… తుప్పల మధ్యలో ఓ పాత ఇల్లు ఉంది. జనరల్‌గా ఆ ఇంటి వైపు ఎవరూ వెళ్లరు. అదేమీ దెయ్యాల కొంప కాదు… అటు వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఎవరూ అటు వెళ్లరు. ఐతే… అక్కడ గ్రిల్స్ లేని కిటికీ నుంచి పొగ రావడం కనిపించింది. అది చూసిన స్థానికులు… “అరేయ్… ఆ ఇంట్లో పొగలొస్తున్నాయేంటి” అని అడిగితే… “ఆ ఏముందిరా… ఎవడో చుట్ట కాల్చుకుంటున్నాడేమో” అన్నారు మరో వ్యక్తి. “చుట్టైతే అంత పొగ వస్తదా… ఎవరైనా కాపురం పెట్టారంటావా…” అని అడిగితే… “నాకేం తెలుసు… పద ఎళ్లి సూద్దాం” అని అక్కడికి వెళ్లారు. అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు.హర్రర్ సినమాల్లో లాగా… మంటపై ఓ కర్రకు మనిషి పుర్రెను తగిలించి… దాన్ని కొద్ది కొద్దిగా తింటూ కనిపించాడు ఓ చింపిరి జుట్టు మనిషి. అది చూసిన స్థానికులకు నోట మాట లేదు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ తర్వాత… మళ్లీ చింపిరి జుట్టు మనిషివైపు చూస్తే… అక్కడ అతను కనిపించలేదు. “అరే… ఏమయ్యాడు… అదుగో… అటు పారిపోతున్నాడు… పదండి పదండి… పట్టుకుందాం” అని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ… ఆ వ్యక్తి… వాళ్ల కంటే వేగంగా పారిపోయాడు.అరగంట తరవాత ఆ ఊరికి పోలీసులొచ్చారు. మాకు కాల్ చేసింది ఎవరు అని అడిగారు. స్థానికులు… మేమే సార్… అంటూ… జరిగింది వాళ్లకు చెప్పారు. పోలీసులు కళ్లు పెద్దవి చేసుకొని విన్నారు. ఆ పుర్రెను చూశారు. పారిపోయిన వ్యక్తి వివరాలు అడిగితే… స్థానికులు ఓ రేంజ్‌లో చెప్పారు. “వాడో సైకో సార్. ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. పేరు రావేల పూడి రాజు. వయసు 20 ఉంటది. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ తర్వాత ఒంటరిగా తిరుగుతూ… అరుస్తూ… సైకోలా మారాడు” అని చెప్పారు. రాజుపై కేసు రాసిన పోలీసులు… ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ పుర్రె ఎక్కడిది? ఏదైనా శ్మశానం నుంచి తెచ్చాడా అనే వివరాలు సేకరిస్తున్నారు, సైకోను పట్టుకున్నారు.