DailyDose

లంచగొండులపై ACB మరో అస్త్రం-నేరవార్తలు

లంచగొండులపై ACB మరో అస్త్రం-నేరవార్తలు

* • క్వారంటైన్ సెంటర్ గా ఉన్న స్వర్ణప్యాలెస్ ను కోవిడ్ సెంటర్ గా మార్చింది ప్రభుత్వం కాదా?• అక్కడ సౌకర్యాలున్నాయో, లేవో అనుమతులు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి తెలియదా?• ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, తప్పులను కప్పిపుచ్చు కోవడానికే వైసీపీనేతలు కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు.• పూర్తి ఆధారాలు, సాక్ష్యాలున్నాకే వైద్యులను అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది.• పూర్తి స్థాయి విచారణ జరపకుండా స్వర్ణప్యాలెస్ ఘటనకు రమేశ్ ను ఎలా బాధ్యులను చేస్తారు?• ప్రభుత్వచర్యలతో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు భయభ్రాంతులతో ప్రజలకు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నారు.• దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు, వైద్యులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?• స్పష్టమైన ఆధారాలుంటే, తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోండి తప్ప, కులాల పేరు తీసుకు రావద్దు.• కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రుల్ని సంప్రదించి, ప్రజలప్రాణాలతో చెలగాటమాడింది ప్రభుత్వం కాదా?• ఫీజులు ఎక్కువ తీసుకుంటే దానిపై విచారించండి.• ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలకొరత, వైద్యుల అవస్థల గురించి డాక్టర్ సుధాకర్ చెబితే, అతన్నేం చేశారు?• కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీసి పబ్బం గడుపుకునే చర్యలు మానుకోండి.• రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వైద్య సౌకర్యాలు మెరుగుపరుచుకుంటే మంచిది.• ఫ్రంట్ లైన్ వారియర్స్ పై కక్షసాధింపులకు పాల్పడితే, ప్రజల జీవితాలకు రక్షణ ఉండదు

* అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. తాడిపత్రికి సమీపంలోని జమ్ములదిన్నెలో సీఐ దేవేందర్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి దూర్భాషలాడారనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కడప జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రభాకర్‌రెడ్డిని ఆదివారం ఉదయం పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన  అనంతరం మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు… ప్రభాకర్‌రెడ్డిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు కడప జైలుకు తరలించనున్నారు.

* జిల్లా ప్రభుత్వ శాఖల్లో “లంచావతారుల”పై అవినీతి నిరోధక అధికారుల కు (A.C.B) కు పిర్యాదు చేసి అవినీతి అధికారుల సమాచారం అందించవచ్చు… అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించారు. ఎవరైనా లంచం అడిగితే..1064 నెంబర్ కు కాల్ చేయాలని ప్రజల కు విజ్ఞప్తి చేస్తూ న్నాను.. A.C.B అధికారులు “లంచం అడిగే” ఉద్యోగుల “సమాచారం ఇచ్చిన వ్యక్తుల, సంస్థల” వివరాలు “గోప్యంగా ఉంచుతారు. లంచం అడగటం, ఇవ్వటం, తీసుకోవటం నేరం..1064 టోల్ ఫ్రీ నెంబర్ దీనిపై ప్రజల్లో అవగాహన విస్త్రృతంగా ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ అధికారుల తో పని చేయించుకోవడం మన హక్కు.. లంచం ఇవ్వకుండా..అధికారుల ను ప్రశ్నిస్తూ… కంప్లయింట్ చేసినప్పుడు “న్యాయం” జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో “అవినీతి నిరోధక శాఖ “సమర్ధవంతంగా” పని చేస్తుంది. ప్రజలు అందరూ కూడా అవినీతిరహిత సమాజం కోసం తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలి. అవినీతి ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ జరుగుతున్నా.. మీ దృష్టికి వస్తే వెంటనే 1064 నెంబర్ కు కాల్ చేసి చెప్పవచ్చు.అవసరం అనుకు౦టే..A.C.B అధికారులు వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు.

* అక్రమ మద్యం తరలిస్తూ ఏపీ భాజపా నేత ఒకరు పట్టుబడ్డారు. తెలంగాణలోని చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో గుడివాక రామాంజనేయులు అలియాస్‌ అంబిబాబును స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.6లక్షలు విలువైన 1,920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుడివాక రామాంజనేయులు సహా మచ్చా సురేశ్‌, కె. నరేశ్‌, గంటా హరీశ్‌ను అరెస్ట్‌ చేశారు. రామాంజనేయయులను ఏ-1గా పేర్కొన్నారు. గుంటూరు ఏఈఎస్‌ చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా రామాంజనేయులు పోటీ చేశారు.

* సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద వాగులో గల్లంతైన లారీ డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం బస్వాపూర్‌ వద్ద లారీ వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం నుంచి క్లీనర్‌ సురక్షితంగా బయటపడగా, డ్రైవర్‌ నీటి ప్రవాహానికి కొట్టుకెళ్లి ఒక చెట్టును పట్టుకున్నాడు. మధ్యాహ్నం వరకు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ ఎదురు చూశాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు.. లారీ డ్రైవర్‌ను కాపాడాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.