అన్నమంటే తెల్లగా మల్లెపువ్వులా నాజూగ్గా పొడిపొడిలా ఉండాలి. కానీ నల్లని బియ్యం కంటే గొప్ప ఆరోగ్య సంపద ఇంకేదీ లేదు. అసోంలోని గోల్‌పరా రాష్ట్రంలో రైతులు ఈ నల్ల బియ్యం సాగు మొదలుపెట్టి అధిక దిగుబడి సాధించారు. ఈ నల్ల బియ్యపు వరిసాగుకు చీడపీడల బాధ ఉండదు. కేవలం వందరోజుల్లో పంట దిగుబడి చేతికి వస్తుంది. అమెరికాలోని లూసియానా విశ్వవిద్యాలయ పరిశోధన ప్రకారం ఈ నల్ల బియ్యంలో విటమిన్ ఇ ఎక్కువ, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఇనుము, జింక్ వంటి ఖనిజ విలువలుంటాయి. బ్లాక్ రైస్‌లో రెండుమూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది. డయాబెటీస్ అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఇన్సూలెన్స్ లెవెల్స్‌ను ఈ బియ్యం తగ్గించడంవల్ల ఒబెసిటీ సమస్య కూడా తగ్గినట్లే. బ్లాక్ రైస్‌లో అంధోనియానిన్స్ ఉంటాయి. ఇవి, కంటి వ్యాధులను నయంచేస్తాయి. ఈ బియ్యంలో ఉండే ఆంధోనియాసిన్స్ మహిళలకు అధికంగా ఉండే క్యాన్సర్ నిరోధకానికి తోడ్పడతాయని క్యాన్సర వైద్య నిపుణులు చెబుతారు. ఈ బియ్యం గంజిని తలకు పట్టిస్తే వెంట్రుకలు బలంగా అందంగా ఉంటాయి. గంజిని ముఖానికి మాస్క్‌గా రోజు వేసుకుంటే మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి.
నల్ల వరి గురించి విన్నారా?
Related tags :