* టెలివిజన్ మార్కెట్లో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్న షావోమి మరో కొత్త ఆవిష్కారానికి తెర తీసింది. ఎడ్జ్-టు-ఎడ్జ్ ట్రాన్స్ పరెంట్ గ్లాస్ డిస్ ప్లేతో, దృశ్యాలు గాలిలో తేలిపోతున్న అనుభూతిని కలిగించేలా అద్భుతమైన ఎంఐ టీవీలను లాంచ్ చేసింది. 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ టీవీలను ప్రదర్శించింది.
* చైనీస్ వీడియో యాప్ టిక్‌టాక్‌పై నిషేధం అనంతరం అమెరికా అధ్యక్షుడి కన్ను మరికొన్ని చైనా కంపెనీలపై పడింది. చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు ఉన్న ఇతర అవకాశాలు కూడా పరిశీలిస్తున్నామని ఆయన శనివారం ప్రకటించారు. చైనాకు చెందిన అలీబాబాలాంటి ఇతర సంస్థలపై ఆంక్షలు పరిశీలిస్తారా? అని శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో విలేకరి ప్రశ్నిచంగా ‘అవును.. మేము ఇతర అంశాలను పరిశీలిస్తున్నాం’ అని ట్రంప్ తెలిపారు.
* ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఇన్‌ఫ్రా దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి తాజాగా మరో పరిణామం ఎదురైంది. ఆడిటింగ్‌లో కంపెనీ సహకరించడం లేదంటూ ప్రైస్ వాటర్‌హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుంది. వివిధ అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ పలు మార్లు కోరినప్పటికీ కంపెనీ ఇవ్వడం లేదంటూ, ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆడిటింగ్ సంస్థ ఆగస్టు 13న లేఖ ద్వారా రాజీనామా ప్రతిపాదన పంపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీవీకే తెలియజేసింది.