* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ సర్కిల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలోని పంగిడి సోమవారం గ్రామం కి చెందిన వృద్ధురాలికి కరోన లక్షణాలు ఉన్నాయని ఆమె బంధువులు వదిలేసి వెళ్లగా పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించి వైద్యుల సూచన మేరకు బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
* తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదలగడిచిన 24 గంటల్లో 1102 కొరొనా పాజిటివ్ కేసులు నమోదుకొత్తగా 9 మరణాలు– మొత్తం 693కి చేరిన మరణాల సంఖ్యGHMC- 234, మేడ్చెల్-63, కరీంనగర్- 101, వరంగల్ అర్బన్-70, రంగరెడ్డి-84, సంగారెడీ-66, కేసులు నమోదుకొత్తగా కొలుకున్నది-1930–ఇప్పటి కొలుకున్నవారి సంఖ్య-68 126 ఉన్నట్లు వెల్లడిప్రస్తుతం ఆక్టీవ్ కేసులు- 22 542–ఇప్పటి వరకు నమోదైన కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య- 91 361 చేరినట్లు వైద్యశాఖ ప్రకటన
* Spike of 63,489 cases and 944 deaths reported in India, in the last 24 hours.The #COVID19 tally in the country rises to 25,89,682 including 6,77,444 active cases, 18,62,258 discharged & 49,980 deaths: Ministry of Health and Family Welfare.
* కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల మండలం అప్పిగట్లకు చెందిన రైతు ఇనగంటి ధనుంజయ (72) చిన్న కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం చిన్న కుమారుడు కరోనా బారిన పడి తెనాలి కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చిన ధనుంజయ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆయన కోసం వెతకడం ప్రారంభించారు.
* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని వీలైనంత త్వరగా గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. వేగంగా, కచ్చితత్వంతో కూడిన వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా తాజాగా లాలాజలంతో కొవిడ్ నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచడంతోపాటు కొవిడ్ టెస్టు ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.